Begin typing your search above and press return to search.

మాస్కుమెడలో కాదు.. మూతికి ధరించండి.. కేంద్రం కీలక సూచనలు..!

By:  Tupaki Desk   |   22 March 2021 1:00 AM GMT
మాస్కుమెడలో కాదు.. మూతికి ధరించండి.. కేంద్రం కీలక సూచనలు..!
X
దేశవ్యాప్తంగా కరోనా తీవ్రరూపం దాల్చుతున్న ప్రస్తుత తరుణంలో కేంద్ర ఆరోగ్యశాఖ సీరియస్​గా స్పందించింది. ఈ మేరకు ఆదివారం కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్​ .. ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘దేశవ్యాప్తంగా చాలా మందిలో కరోనా భయం పోయింది. చాలా మంది మాస్కులు పెట్టుకోవడమే మరిచిపోయారు. భౌతికదూరం ఎవరూ పాటించడం లేదు. కొంతమంది మాస్కులు మెడలో వేసుకుంటున్నారు. ఇలా వేసుకోవడం వల్ల ఏ లాభము ఉండదు. మాస్కులను ప్రాపర్​ గా ధరిస్తేనే కరోనానుంచి బయట పడవచ్చు’ అంటూ ఆయన పేర్కొన్నారు.

కరోనా పెరుగుతున్న ప్రస్తుత టైంలో ప్రజలు సహకరించాలని కోరారు. కేంద్రం, రాష్ట్రాలు, ఆరోగ్యశాఖ చేస్తున్న సూచనలను తప్పనిసరిగా పాటించాలని కోరారు. దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్​ ముమ్మరంగా కొనసాగుతున్నదని చెప్పారు. ప్రతి ఒక్కరు కచ్చితంగా రెండు డోసుల వ్యాక్సిన్​ తీసుకోవాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం వహించొద్దన్నారు. వ్యాక్సిన్ ​పై జరుగుతున్న దుష్ప్రచారాన్ని ప్రజలు నమ్మొద్దని పేర్కొన్నారు.

మహారాష్ట్ర, పంజాబ్, మధ్యప్రదేశ్, తమిళనాడు లో కేసులు పెరుగుతున్నాయని ఇక్కడ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. గత 24గంటల్లో దేశ వ్యాప్తంగా 43,846 కరోనా కేసులు నమోదయ్యాయి. రికార్డు స్థాయిలో కరోనా విజృంభిస్తున్నది.

కేంద్రం సూచించిన జాగ్రత్తలు ఇవే..!

ప్రతి ఒక్కరూ 20 సెకన్ల పాటు, హ్యాండ్​వాష్​ లేదా సబ్బుతో చేతులను శుభ్రపరుచుకోవాలి. బయటకు వెళ్లినప్పుడు కచ్చితంగా శానిటైజర్​ తీసుకెళ్లాలి. కచ్చితంగా మాస్కు ధరించాలి. దగ్గినప్పుడు చేతిరుమాలు, టిష్యూ అడ్డుపెట్టుకోవాలి. ప్రజలు గుంపులుగా తిరగొద్దు. షాపింగ్​లను వీలైనంత వరకు తగ్గించుకోవాలి. వివాహవేడుకలు, తదితర కార్యక్రమాలు తక్కువ మందితో చేసుకోవాలి. ప్రభుత్వ కార్యాలయాల్లోనూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.