Begin typing your search above and press return to search.

దేశంలో 24 గంటల్లో 24 వేల కొత్త కరోనా కేసులు!

By:  Tupaki Desk   |   16 March 2021 9:00 AM GMT
దేశంలో 24 గంటల్లో 24 వేల కొత్త కరోనా కేసులు!
X
దేశంలో కరోనా వైరస్ మహమ్మారి మరోసారి విజృంభిస్తోంది. ఇటీవల కొద్ది వారాల నుంచి పాజిటివ్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. అంతకు ముందు వారంతో పోల్చితే గతవారం 33 శాతం మేర పెరుగుదల నమోదయ్యింది. మరణాలు కూడా 28 శాతం మేర పెరిగి ఆరువారాల గరిష్ఠానికి చేరాయి. పాజిటివ్ కేసులతో పాటుగా మరణాల సంఖ్య కూడా పెరుగుతుండటంతో కేంద్రం రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. అటు మహారాష్ట్రతో పాటుగా మిగతా కొన్ని రాష్ట్రాల్లో కూడా కేసుల సంఖ్య పెరుగుతున్నది.

ఇక గడిచిన 24 గంటల్లో ఇండియాలో కొత్తగా 24,492 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో ఇప్పటి వరకు 114,09,831 కేసులు నమోదయ్యాయి. ఇందులో 1,10,27,543 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 2,23,432 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో ఇండియాలో కరోనాతో 131 మంది మృతి చెందారు. దీంతో దేశంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 1,58, 856కి చేరింది. గడిచిన 24 గంటల్లో ఇండియాలో 20,191 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ తన కరోనా బులెటిన్ లో వెల్లడించింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,10,27,543 మంది కోలుకున్నారు. 2,23,432 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. దేశవ్యాప్తంగా 3,29,47,432 మందికి వ్యాక్సిన్లు వేశారు.