Begin typing your search above and press return to search.
శుభకార్యాలకు ఇంటికి మారువేషాల్లో అధికారులు..ఎక్కడంటే?
By: Tupaki Desk | 1 March 2021 7:30 AM GMTకరోనా పుణ్యమా అని కొత్త మార్పులు శరవేగంగా చోటు చేసుకుంటున్నాయి. ఇంట్లో జరిగే శుభకార్యాలకు అధికారులు మారువేషాల్లో వచ్చి.. అక్కడి పరిస్థితుల్ని గమనించేలా తీసుకున్న నిర్ణయంపై షాకింగ్ గా మారింది. ఇంట్లో జరిగే ఫంక్షన్ కు హాజరయ్యే అతిధులు.. అక్కడ తీసుకునే జాగ్రత్తలపై ముంబయి మహానగర శాఖ డేగకన్ను వేయనుంది. అంతకంతకూ విస్తరిస్తున్న కరోనాకు చెక్ పెట్టేందుకు వీలుగా బీఎంసీ అధికారులు శుభకార్యాలు జరిగే ఇంటికి మారువేషాల్లో అతిధుల మాదిరి వెళ్లనున్నారు.
కరోనా నిబంధనల్ని తూచా తప్పకుండా పాటిస్తున్నారా? ఫంక్షన్ కు ఎంతమంది వచ్చారు? లాంటివి చెక్ చేస్తారు. ఈ విషయంలో ఏ మాత్రం తేడా వచ్చినా.. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినట్లు తేలితే వారిపై చర్యలు తీసుకోనున్నారు. ఇదే విషయాన్ని బీఎంసీ అదనపు కమిషన్ సురేశ్ కాకాణి వెల్లడించారు. దేశంలోని పలు మహానగరాల్లో కరోనా విస్తరణకు అంతఇంతో బ్రేక్ పడినా.. ముంబయిలో మాత్రం అలాంటి పరిస్థితి లేదు.
ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. కరోనా వైరస్ విస్తరణ ఒక పట్టాన ఆగటం లేదు. దీంతో.. విస్తరణకు చెక్ చెప్పేందుకు ఉన్న అన్ని అవకాశాల్ని అధికారులు పరిశీలిస్తున్నారు. ఫంక్షన్ ఏదైనా యాభై మంది కంటే ఎక్కువ బంధువులు ఉన్నారా? కరోనా నిబంధనల్ని పాటిస్తున్నారా? అన్న విషయాన్ని వారు చూస్తారు. భౌతిక దూరం లేకున్నా.. మాస్కులు పెట్టుకోకున్నా నిర్వాహకులపై చర్యలు తీసుకుంటారు. ఇంట్లో ఫంక్షన్ ఏమో కానీ.. ఏ నిమిషాన ఏ రూపంలో అధికారులు అతిధుల రూపంలో ఎంట్రీ ఇచ్చి.. రూల్ బుక్ లో లా లేదని రచ్చ చేస్తే.. తమ పరిస్థితి ఏమిటన్న ప్రశ్న పలువురి నోట వస్తోంది.