Begin typing your search above and press return to search.
దేశంలో భారీగా పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులు ... ఇలా అయితే కష్టమే ?
By: Tupaki Desk | 27 Feb 2021 9:57 AM GMTదేశంలో కరోనా మహమ్మారి కేసులు రోజురోజుకి పెరిగిపోతూనే ఉన్నాయి. దేశంలో కొత్తగా నమోదైన కరోనా కేసుల వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం విడుదల చేసింది. వాటి ప్రకారం, దేశంలో గత 24 గంటల్లో 16,488 మందికి కరోనా నిర్ధారణ అయింది. అదే సమయంలో 12,771 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,10,79,979కు చేరింది. గడచిన 24 గంటల సమయంలో 113 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,56,938కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,07,63,451 మంది కోలుకున్నారు. 1,59,590 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్ లలో చికిత్స అందుతోంది. ఇప్పటివరకు 1,42,42,547 మందికి వ్యాక్సిన్ వేశారు.
దేశంలో కొత్తగా యాక్టివ్ కేసులు 3,604 పెరిగాయి. ఇదో ప్రమాదకర సంకేతం. మరణాలు 113 రావడం ప్రమాదకరమే. ప్రదానంగా మహారాష్ట్రలో యాక్టివ్ కేసులు 3349 పెరిగాయి. అలాగే పంజాబ్ లో 352 - గుజరాత్ లో 145 - ఢిల్లీలో 62 - హర్యానాలో 49 - ఛండీఘర్ లో 43 యాక్టివ్ కేసులు పెరిగాయి. మహారాష్ట్రతోపాటూ... ఢిల్లీ చుట్టుపక్కల కరోనా బాగా పెరుగుతోంది. మొత్తం కరోనా మరణాల్లో అమెరికా టాప్‌లో ఉండగా... బ్రెజిల్ - మెక్సికో - ఇండియా - బ్రిటన్ తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నాయి. రోజువారీ మరణాల్లో అమెరికా టాప్‌లో ఉంది. ఆ తర్వాత బ్రెజిల్ - మెక్సికో - రష్యా - జర్మనీ తర్వాతి పొజిషన్లలో ఉన్నాయి.