Begin typing your search above and press return to search.
కరోనా మహమ్మారి ఎప్పటికి - ఎలా అంతమైపోతుందంటే?
By: Tupaki Desk | 25 Feb 2021 10:30 AM GMTగత ఏడాది మొత్తం కరోనా మహమ్మారితోనే గడిచింది. ఈ ఏడాదైనా కూడా కరోనా మహమ్మారి అంతమైపోతుందా అంటే కచ్చితంగా చెప్పలేని పరిస్థితి. ఎన్ని కరోనా వ్యాక్సిన్లు వచ్చినా మహమ్మారి పూర్తిగా అంతంకాలేదు. ఇంకా కరోనా విజృంభిస్తూనే ఉంది. ఎప్పటికీ కరోనా అంతమవుతుందో కూడా అంతుపట్టడం లేదు. సాధారణ పరిస్థితులు ఎప్పుడూ వస్తాయా అని ప్రపంచమంతా ఆశగా ఎదురుచూస్తోంది. కరోనా రోజురోజుకీ మ్యుటేషన్ చెందుతూ కొత్తకొత్త వేరియంట్లు పుట్టకొస్తున్నాయి. మహమ్మారిని నిర్మూలించే కరోనా వ్యాక్సిన్లు ప్రపంచవ్యాప్తంగా తయారవుతునే ఉన్నాయి.
ఈ వ్యాక్సిన్లు మ్యుటేషన్ వేరియంట్లపై ఎంతవరకు సమర్థవంతంగా పనిచేస్తాయనేది కూడా ప్రశ్నర్థాకంగానే ఉంది. కరోనా వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చినా కరోనా తీవ్రత మాత్రం తగ్గడం లేదు. పలు దేశాల్లో కరోనా సెకండ్ వేవ్ కొనసాగుతుంది. డిసెంబర్ 2021 నాటికి అందరి జీవితాలు సాధారణ స్థితికి రావచ్చు. కానీ, కొన్ని ప్రాంతాల్లో మాత్రం మాస్క్ ధరించాల్సిన అవసరం ఉంది. 2022లోనూ కరోనా పరిస్థితులు కొనసాగే పరిస్థితులు కనిపిస్తున్నాయని సైంటిస్టులు అభిప్రాయపడుతున్నారు. హెర్డ్ ఇమ్యూనిటీతోనే కరోనా మహమ్మారిని అంతం చేయడం సాధ్యపడుతుందని భావిస్తున్నారు. అయితే అది ఇప్పట్లో సాధ్యమైయ్యేలా కనిపించడంలేదు.
ప్రపంచ జనాభాలో 70శాతం నుంచి 80శాతం కరోనావైరస్ నుంచి ఇమ్యూనిటీ సాధించాలి. హెర్డ్ ఇమ్యూనిటీ సాధించాలంటే తగినంత స్థాయిలో అందరికి టీకాలు వేయించుకోవాల్సిన అవసరం ఉందని సైంటిస్టులు సూచిస్తున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి 22 నాటికి సుమారు 44.1 మిలియన్ల మందికి కరోనా వ్యాక్సిన్ కనీసం ఒక మోతాదు అందినట్టు ఓ నివేదిక పేర్కొంది. 19.4 మిలియన్లకు రెండు మోతాదులతో పూర్తిగా టీకాలు వేయించారు. హెర్డ్ ఇమ్యూనిటీని సాధించడం అంటే సుమారు 300 మిలియన్ల మందికి టీకాలు వేయాలి.. 600 మిలియన్ మోతాదుల వరకు అవసరం పడుతుంది. ఇప్పటికే 45 మిలియన్ మోతాదులు మాత్రమే అందించారు. ప్రస్తుత రేటు ప్రకారం, జాతీయ స్థాయిలో హెర్డ్ ఇమ్యూనిటీని సాధించడానికి అమెరికాలో ఒక ఏడాది పట్టొచ్చు. వృద్ధులు, పిల్లలు సహా అందరికి టీకాలు అందుబాటులోకి రావాల్సి ఉంది. దీన్ని బట్టి చూస్తే ఈ ఏడాది చివరికి అందరికి టీకా ఇస్తే , హెర్డ్ ఇమ్యూనిటీని సాధిస్తే.. కరోనా మహమ్మారిని అంతమైపోనట్టే.
ఇదిలా ఉంటే దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న వేళ.. కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఇప్పటికే వైద్యులు, ఆరోగ్య సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు వంటి ఫ్రంట్ లైన్ వర్కర్లకు ఉచితంగా టీకాలు వేసిన కేంద్రం.. మార్చి 1 నుంచి సామాన్య ప్రజలకు కూడా టీకా వేయనున్నట్లు ప్రకటించింది. 60 ఏళ్లు పైబడిన వారితో పాటు 45 ఏళ్లు పైబడి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి మార్చి 1 నుంచి టీకాలు వేస్తామని తెలిపింది. మొత్తం 10వేల ప్రభుత్వ వ్యాక్సినేషన కేంద్రాలు, 20వేల ప్రైవేట్ వ్యాక్సినేషన్ కేంద్రాల్లో వ్యాక్సిన్ ఇస్తామని కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ తెలిపారు. ఐతే ప్రభుత్వ వ్యాక్సినేషన్ కేంద్రాల్లో ఉచితంగానే టీకాలు వేస్తారని ఆయన వెల్లడించారు.