Begin typing your search above and press return to search.
15 రాష్ట్రాల్లో ఒక్క కేసు నమోదు కాలేదు: కేంద్ర పాలిత ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి..
By: Tupaki Desk | 10 Feb 2021 5:14 AM GMTకంటికి కనిపించని కరోనా వైరస్ ప్రపంచాన్ని అతలాకుతలం చేసింది. కోట్లమంది ప్రాణాలను బలి తీసుకుంది. చైనాలోని వూహాన్ మూలన పుట్టిన ఈ వైరస్ ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తూ ఇండియాలోనూ ప్రవేశించింది. కోటి మంది బాడీల్లోకి ప్రవేశించింది. దాదాపు లక్షన్నర మంది మరణాలకు కారణమైంది. ఆర్థికాభివృద్ధిలో మిగతా దేశాల కంటే వెనుకబడి ఉన్న భారత్ కరోనా వ్యాక్సిన్ ను మాత్రం అందరికంటే ముందుగా దేశ ప్రజలందరికీ అందుబాటులోకి తెచ్చింది. దీంతో వాతావరణ పరిస్థితులతో పాటు వ్యాక్సిన్ల ప్రభావంతో కరోనా తగ్గుముఖం పడుతోంది. రోజుకు దాదాపు 90 వేల వరకు నమోదైన కేసులు నేడు సగటున 9 వేల కేసులు నమోదవుతున్నాయి.
దేశంలో కరోనా వైరస్ ను పారదోలినట్లేననిపిస్తోంది. గడిచిన 24 గంటల్లో భారత్ లో 15 రాష్ట్రాల్లో, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఒక్క కరోనా కేసు నమోదు కాలేదు. ఈ విషయాన్ని జాతీయ ఆరోగ్య కార్యదర్శి రాజేశ్ భూషణ్ తెలిపారు. వారం రోజుల నుంచి ఇదే పరిస్థితి కొనసాగుతోందని ఆయన వెల్లడించారు.
నీతి అయోగ్ సభ్యుడు వీకే పాల్ సైతం మాట్లాడుతూ నిన్న ఢిల్లీలో ఒక్క కరోనా కేసు నమోదు కాలేదన్నారు. రోజువారీ కరోనా కేసులతో పాటు మరణాల సంఖ్య తగ్గుతోందన్నారు. అయితే ఈ ముప్పు ఇంకా తొలగిపోలేదని, జాగ్రత్తలు పాటించక తప్పదన్నారు. వ్యాక్సిన్ల ప్రక్రియ పూర్తయ్యే సరికి మాస్క్, భౌతిక దూరం పాటించాలన్నారు.
మరోవైపు వ్యాక్సిన్ల తీసుకున్న వారికి కరోనా సోకిన దాఖలాలు ఉన్నాయి. తాజాగా తెలంగాణలోని మంచిర్యాల జిల్లాలో టీకా తీసుకున్న 8 మంది వైద్య సిబ్బందికి పాజిటివ్ రిపోర్టు వచ్చింది. వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకోవాలని రెండింటి మధ్య 28 రోజుల వ్యవధి ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. ఈ వ్యవధిలో వైరస్ బారిన పడే అవకాశం ఉందని సూచిస్తున్నారు. అందువల్ల సాధారణ ప్రజలకు వ్యాక్సిన్లు అందేసరికి జాగ్రత్తలు పాటించాలని వైద్యాధికారులు తెలుపుతున్నారు.
మొన్నటి వరకు వైద్య సిబ్బందికి వ్యాక్సిన్ ఇవ్వగా.. రెండు రోజుల నుంచి ఫ్రంట్ లైన్ వర్కర్లకు టీకా అందిస్తున్నారు. మరోవైపు కరోనా వైరస్ సోకిన వారిని ట్రీట్ మెంట్ చేస్తున్నారు. ఏదీ ఏమైనా మొత్తంగా కరోనా కోరల్లో నుంచి భారత్ బయటపడే అవకాశాలు ఎక్కువేనంటున్నారు.