Begin typing your search above and press return to search.

కరోనా సింగిల్ డోస్ వచ్చేస్తోంది.. డబుల్ డోస్ వ్యాక్సిన్ కు స్వస్తి..

By:  Tupaki Desk   |   6 Feb 2021 11:50 AM GMT
కరోనా సింగిల్ డోస్ వచ్చేస్తోంది.. డబుల్ డోస్ వ్యాక్సిన్ కు స్వస్తి..
X
ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా మహమ్మారికి వ్యాక్సిన్ రాగా. టీకాల పంపిణీ సాగుతోంది. కరోనా టీకా వేసుకుంటే.. ఇమ్యునిటీ పవర్ పెరిగి.. వ్యాధి దరిదాపులకు రాదని వైద్యలు చెబుతున్నారు. అయితే ఈ టీకా.. ఒక్కొక్కరికి రెండు డోసులు వేయాల్సి ఉంటుండంతో టీకా వేసుకున్న వారు.. వేసుకునేందుకు ముందుకు వచ్చేవారు కొంత భయపడుతున్నారు. టీకా వేసుకునేందుకు ముందుకు రావడం లేదు. ఈ క్రమంలో జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ శుభవార్తను అందించింది. కరోనా సింగిల్ డోసు టీకాను అందిస్తామని ప్రకటించింది. ఈ మేరకు ఎమర్జెన్సీ అనుమతి కోసం దరఖాస్తు చేసుకుంది. ఇప్పటికే అందుబాటలోకి వచ్చిన టీకాల కన్నా సమర్థవంతంగా ఈ వ్యాక్సిన్ పనిచేస్తోంది.

కోవిడ్ విజృంభణ తరువాత ఒక సంవత్సరం అనంతరం చాలా దేశాల్లో వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది. కోవిడ్ 19 నివారణకు ఇప్పటికే చాలా దేశాల్లో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అయితే ఇప్పటి వరకు అందుబాటులోకి వచ్చిన టీకాలన్నీ రెండు డోసులకు సంబంధించినవే. దాదాపు అన్ని వ్యాక్సిన్లు.. 28 రోజుల వ్యవధిలో రెండో డోసు తీసుకోవాలసి ఉంటుంది. మరో విషయం ఏంటంటే.. రెండోడోసు తీసుకున్న తరువాత కరోనా వైరస్ నుంచి 90శాతం రక్షణ లభిస్తుందట. కొన్ని ఫార్మా కంపెనీలు ఇంకా కరోనా వ్యాక్సిన్ తయారీపై పరిశోధనలు చేస్తున్నాయి. అందులో జాన్సన్ అండ్ జాన్సన్ టీకాపై అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ సంస్థ శుభవార్తను అందించింది.

తమ సింగిల్ డోసు టీకా ఇప్పటి వరకు అందుబాటులోకి వచ్చిన కోవిడ్ 19 టీకాల కన్నా.. సమర్థవంతంగా పనిచేస్తుందని సంస్థ చెప్పుకువస్తుంది. ఈ మేరకు అత్యవసర వినియోగానికి అనుమతి కోరుతూ.. అమెరికా నియంత్రణ సంస్థకు దరఖాస్తు చేసుకుంది. అనుమతి వచ్చిన వెంటనే టీకా పంపిణీ చేస్తామని.. అందుకు అనుగుణంగా ఏర్పాట్లు సైతం చేశామని జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ ప్రతినిధులు చెప్పుకొచ్చారు. కోవిడ్ మరణాల నుంచి తమ టీకా 100 శాతం రక్షణ కల్పిస్తుందని అంటున్నారు. వ్యాక్సిన్ తీసుకున్న 14 రోజుల్లోపే వైరస్ నుంచి రక్షణ కల్పిస్తుందని సంస్థ చెప్పింది. యూఎస్ లో ఇప్పటికే రెండు వ్యాక్సిన్లకు అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. జాన్సన్ అండ్ జాన్సన్ అందించిన సమాచారం పరిశీలించి .. టీకా అనుమతులపై త్వరలోనే నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

తాము అభివృద్ధి చేస్తున్న సింగిల్ డోసు టీకా.. కరోనా వైరస్ ను ఎదుర్కొనడంలో 60శాతం సమర్థవంతంగా పనిచేసినట్లు.. జాన్సన్ అండ్ జాన్సన్ ఇప్పటికే ప్రకటించింది. తీవ్ర కేసుల్లో 85శాతం సమర్థత చూపినట్లు వెల్లడించింది. సింగిల్ డోసు టీకా ప్రయోగాలను ప్రపంచవ్యాప్తంగా 44వేల మందిపై జరిపినట్లు కంపెనీ తెలిపింది. తరువాత సంబంధిత ఫలితాలు వెల్లడించింది. అమెరికాలో జరిపిన ప్రయోగాల్లో 72శాతం వ్యాక్సిన్ సమర్థత చూపింది. లాటిన్ అమెరికా వంటి ప్రాంతాల్లో 66శాతం, దక్షిణాఫ్రికా 57శాతం సమర్థత కనబరిచిందని ఆ సంస్థ తెలిపింది.

అయితే అమెరికాలో కరోనా ఉధృతి ఏ మాత్రం తగ్గడం లేదు. అక్కడ డిసెంబర్ నుంచే టీకాలు అందిస్తున్నారు. ఆస్ట్రాజెనెకా ఆక్సఫర్ట్, మోడెర్నా వ్యాక్సిన్లు ఎమర్జెన్సీ వినియోగం కింద తీసుకొచ్చారు. ఈ రెండు టీకాలను రెండు డోసుల్లో వేసుకోవలసి ఉంటుంది. జాన్సన్ అండ్ జాన్సన్ సంస్థ వ్యాక్సిన్ ఒక్క డోస్ సరిపోతుంది. అంతే కాకుండా సాధారణ రిఫ్రిజిరేటర్ ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేసుకునే వెసులుబాటు సైతం అందుబాటులో ఉంది.