Begin typing your search above and press return to search.
వ్యాక్సిన్ మరొకరి ఉసురు తీసింది.. ఈసారి ఎక్కడంటే?
By: Tupaki Desk | 31 Jan 2021 8:30 AM GMTప్రపంచాన్ని భయపెట్టిన మహమ్మారికి వ్యాక్సిన్ వచ్చినందుకు సంతోషం.. అప్పుడప్పుడు చోటు చేసుకుంటున్న పరిణామాలతో ఆవిరి అవుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటివరకు నాలుగు మరణాలు చోటు చేసుకున్నాయి. కరోనా వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత ఇవి చోటు చేసుకోవటం గమనార్హం. మిగిలిన వారికి ఎలాంటి దుష్ప్రభావాన్ని చూపించని వ్యాక్సిన్.. వీరి విషయంలోనే ఎందుకిలా జరిగిందన్న విషయంపై స్పష్టత రావటం లేదు.
తాజాగా మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం ముత్యంపల్లి గ్రామానికి చెందిన అంగన్ వాడీ ఆయా సుశీల ఈ నెల 19న మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కరోనా వైరస్ వ్యాక్సిన్ తీసుకుంది. అప్పటి నుంచి జ్వరం రావటంతో ఆసుపత్రిలో చూపించారు. అయినప్పటికి జ్వరం తగ్గక శ్వాస తీసుకోలేని పరిస్థితి ఏర్పడింది.
దీంతో ఆమె ఈ నెల 28న మంచిర్యాలలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ పరిస్థితి విషమించటంతో వెంటిలేటర్ పై ఉంచి చికిత్స అందించారు. అయినప్పటికీ వైద్యుల సలహా మేరకు ఆమెను నిమ్స్ కు తరలించారు. ఆమెకు చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున మరణించారు. అయితే.. ఆమె మరణానికి.. వ్యాక్సిన్ కారణమా? లేదా? అన్న అంశం తేలాల్సి ఉంది.