Begin typing your search above and press return to search.
ప్రపంచంపై కొనసాగుతున్న కరోనా దండయాత్ర..ఒక్కరోజే 6,12,214 పాజిటివ్ కేసులు - 8,836 మరణాలు!
By: Tupaki Desk | 11 Jan 2021 6:55 AM GMTప్రపంచాన్ని హడలెత్తిస్తున్న కొత్త కరోనా వైరస్. ఇప్పటికే ఉన్న కరోనా మహమ్మారి కారణంగా అల్లాడిపోతుంటే.. ఇప్పుడు కొత్త రకం స్ట్రెయిన్ వైరస్ జనాలకు ముచ్చెమటలు పట్టిస్తోంది. ఓవైపు కొందరు నిపుణులు స్ట్రెయిన్ వైరస్ కు భయపడాల్సిన పనిలేదని చెబుతుండగా , ప్రతిరోజూ ప్రపంచ వ్యాప్తంగా భారీగా కరోనా పాజిటివ్ కేసులు వెలుగులోకి వస్తున్నాయి.
ఇక కొన్ని దేశాల్లో కరోనా సెకండ్ వేవ్ భయంకరంగా కొనసాగుతున్న తరుణంలో కరోనా మృతుల సంఖ్య కూడా భారీగానే పెరుగుతుంది. నిన్న ఒక్క రోజు 6,12,214 పాజిటివ్ కేసులు, 8,836 మరణాలు సంభవించాయి. కాగా ఇప్పటివరకు మొత్తం కరోనా కేసుల సంఖ్య 90,691,625కి చేరింది. అలాగే ఇప్పటివరకూ ప్రపంచ వ్యాప్తంగా 1,943,131 మంది కరోనాతో మరణించారు. ఇక 64,813,561 మంది కరోనా తో కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.
ఇక అమెరికాలో కరోనా వైరస్ ఉగ్రరూపం దాల్చుతోంది. సెకండ్ వేవ్ కొనసాగుతుండటంతో ప్రతీ రోజూ లక్ష కేసులు నమోదవుతున్నాయి. ప్రస్తుతం అమెరికా వ్యాప్తంగా మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 22,917,334కి చేరింది. అలాగే ఈ వైరస్ వల్ల ఇప్పటివరకూ అమెరికాలో 383,275 మంది మృతి చెందారు. ఇక బ్రెజిల్, రష్యా, ఫ్రాన్స్, స్పెయిన్, యూకేలలో కరోనా తీవ్రత ఎక్కువగా ఉంది.ముఖ్యంగా బ్రిటన్, ఆఫ్రికా దేశాల్లో కొత్తరకం ‘స్ట్రెయిన్’ వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుండటంతో ప్రపంచమంతా ఆందోళన కలిగిస్తోంది.
దేశంలో గత 24 గంటల్లో 16,311 మందికి కరోనా నిర్ధారణ అయింది. అదే సమయంలో 19,299 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య1,04,66,595కు చేరింది.గడచిన 24 గంటల సమయంలో 161 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,51,160 కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,00,92,909 మంది కోలుకున్నారు. 2,22,526 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 18,17,55,831 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న 6,59,209 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.