Begin typing your search above and press return to search.
ప్రభుత్వ ఖర్చుతో వ్యాక్సిన్.. దేశంలో ఎంతమందికి ఆ అవకాశమంటే?
By: Tupaki Desk | 2 Jan 2021 6:15 AM GMTకళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్న కరోనా వ్యాక్సిన్ ఎట్టకేలకు వచ్చేసింది. ఇప్పటికే దేశానికి చేరుకున్న ఈ వ్యాక్సిన్ ను త్వరలోనే వినియోగించనున్నారు. భారీ ఎత్తున చేపట్టాల్సిన వ్యాక్సినేషన్ కార్యక్రమానికి ఎంతో కసరత్తు అవసరం. అందుకే డ్రైరన్ ను షురూచేస్తున్నారు. దేశ వ్యాప్తంగా వ్యాక్సినేషన్ కార్యక్రమం చేపట్టటం.. ఎక్కడా ఏ లోపం లేకుండా చూసుకోవటం చాలా అవసరం. ఇందుకు ప్రభుత్వం పక్కాగా ప్లాన్ చేస్తోంది.
ఇంతకూ ప్రభుత్వం ఖర్చుతో ఎంతమందికి వ్యాక్సిన్ వేస్తారు? అన్న విషయంపై పలు సందేహాలు ఉన్నాయి. దీనిపై తాజాగా నీతి అయోగ్ సభ్యుడు.. జాతీయ కోవిడ్ టాస్క్ ఫోర్సు సభ్యులు వినోద్ పాల్ మాట్లాడుతూ.. రాబోయే ఆరు నుంచి ఎనిమిది నెలల మధ్య కరోనా ఫ్రంట్ లైన్ వర్కర్లుగా ఉన్న ఆరోగ్య కార్యకర్తలు.. ఇతర వ్యాధులతో బాధ పడే పెద్ద వారికి వ్యాక్సిన్ ఇవ్వనున్నటల్ు చెప్పారు.
దేశ వ్యాప్తంగా 29వేల వ్యాక్సినేషన్ పాయింట్లను ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం 31 హబ్ లను సిద్ధం చేశారు. వ్యాక్సినేషన్ కోసం దేశ వ్యాప్తంగా భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. తొలుత 30 కోట్ల మందికి వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. వారందరికి ఉచితంగా ఇవ్వనున్నారు. దాని ఖర్చును ప్రభుత్వమే భరించనుంది. మొత్తం జనాభా కాకుండా 30 కోట్ల మందికి వ్యాక్సిన్ ఇవ్వాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. దీని ద్వారా దేశ వ్యాప్తంగా కరోనా కారణంగా చోటు చేసుకునే మరణాలకు కళ్లాలు పడతాయని భావిస్తున్నారు. ఎన్నికలకు ఏ రీతిలో అయితే.. పక్కాగా ఏర్పాట్లు చేస్తారో.. అదే రీతిలో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని మహా బాధ్యతగా పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. మాటలు బాగానే ఉన్నా.. చేతలు ఎలా ఉంటాయో చూడాలి.