Begin typing your search above and press return to search.

యూకే వైరస్ ను పట్టేసే సీన్ తెలుగు రాష్ట్రాల్లో ఎంత?

By:  Tupaki Desk   |   29 Dec 2020 5:22 AM GMT
యూకే వైరస్ ను పట్టేసే సీన్ తెలుగు రాష్ట్రాల్లో ఎంత?
X
కొత్త కష్టం మీద పడినట్లే. ఇప్పుడిప్పుడే కరోనా తాకిడి నుంచి తట్టుకొని నిలబడుతున్న దేశానికి.. యూకే వైరస్ కొత్త సవాళ్లు విసురుతోంది. తాజాగా జరిపిన పరీక్షల్లో యూకే కొత్త స్ట్రెయిన్ ఆనవాళ్లను తెలంగాణకు చెందిన ఒక వ్యక్తిలో గుర్తించటంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఇంతకీ.. ఈ కొత్త స్ట్రెయిన్ ను గుర్తించే సత్తా తెలుగు రాష్ట్రాల్లో ఉందా? అన్నది ప్రశ్న.

కరోనా మొదట్లో.. టెస్టింగ్ కోసం భారీ కసరత్తు జరిగేది. అందుకోసం వేళ్ల మీద లెక్కించే సంస్థలు మాత్రమే అందుబాటులో ఉండేవి. క్రమంగా వాటిని విస్తరించి.. చివరకుమన గల్లీల్లో ఉండే డయాగ్నస్టిక్ సెంటర్ లోనూ అందుబాటులోకి వచ్చేలా చేశారు. తాజా యూకేస్ట్రెయిన్ ను గుర్తించే విషయంలోనూ అలాంటి సమస్యలు తప్పవంటున్నారు. కాకుంటే.. ఈ కొత్త వైరస్ వ్యాప్తి వేగం ఎక్కువగా ఉండటంతో.. దానికి వేగానికి తగ్గట్లు.. వైరస్ ను గుర్తించే వ్యవస్థల్ని మనం సిద్ధం చేసుకోగలుగుతామా? అన్నది అసలు ప్రశ్నగా చెప్పాలి.

ఈ సమస్యను కేంద్రం కూడా గుర్తించింది. యూకే వైరస్ ను గుర్తించేందుకు వీలుగా తెలుగు రాష్ట్రాల్లో రెండు సంస్థలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. అందులో ఒకటి సీసీఎంబీ కాగా.. రెండోది సెంటర్ ఫర్ డీఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అండ్ డయాగ్నస్టిక్స్ సంస్థల్లో కొత్త వైరస్ జాడ గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. దేశ వ్యాప్తంగా ఎనిమిది సెంటర్లను కేంద్రం గుర్తించింది. ఆయా రాష్ట్రాలు తాము సేకరించిన శాంపిళ్లను ఈ కేంద్రాలకు పంపి.. పరీక్షలు జరుపుతారు. వీటి ఫలితాల్ని విశ్లేషించేందుకు ఢిల్లీలోని నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ సంస్థకు పంపుతారు. అక్కడ వైరస్ పుట్టుక.. వ్యాప్తిపై అధ్యయనం చేసే వీలుంది. ఏమైనా.. కొత్త వైరస్ ను గుర్తించేందుకు వీలుగా.. పెద్ద ఎత్తున ల్యాబ్ లో కొత్త సాంకేతికతను అందుబాటులోకి తేవాల్సిన అవసరమైతే ఉందని చెప్పక తప్పదు.