Begin typing your search above and press return to search.

కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకోవాలనుకుంటున్నారా? ఇలా చేయాలంతే

By:  Tupaki Desk   |   10 Dec 2020 3:57 AM GMT
కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకోవాలనుకుంటున్నారా? ఇలా చేయాలంతే
X
వణికిస్తున్న కోవిడ్ 19కు పరిష్కారం వచ్చేయటం తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా పలు పరిశోధనా సంస్థలు వ్యాక్సిన్ తయారీపై ఫోకస్ పెట్టటమేకాదు.. అనుకున్నట్లే..తాజాగా బ్రిటన్ లో ప్రజలకు వ్యాక్సిన్ ఇచ్చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నెల 25న కోవిడ్ వ్యాక్సిన్ ను దేశంలోనూ షురూ చేయనున్నారు. జనవరి 15 నుంచి సాధారణ పౌరులకు వ్యాక్సిన్ వేస్తారని చెప్పటం తెలిసిందే.

మరి.. వ్యాక్సిన్ ఎలా వేస్తారు? టీకా వేయించుకోవాలనుకుంటే ఏం చేయాలి? లాంటి సందేహాలు చాలామందిని వెంటాడుతున్నాయి. దీనికి ముందుగా కోవిన్ యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే వ్యాక్సిన్ వేయించుకునే వీలు ఉంటుంది. అయితే.. ఈ యాప్ ను ప్రస్తుతానికి రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రమే వాడే అవకాశాన్ని ఇచ్చారు. త్వరలో ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు.

మరో వారం పది రోజుల్లో సాధారణ ప్రజలకు ఈ యాప్ అందుబాటులోకి వస్తుంది. ఇందులో మన పేరును రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది. అనంతరం.. ఎక్కడ టీకా వేయించుకోవాలన్న సమాచారం అందుతుంది. అంతేకాదు.. వ్యాక్సిన్ వేయించుకున్న తర్వాత అక్కడే గంట పాటు ఉండాల్సి ఉంటుంది. ఆ సందర్భంలో అనుకోని రీతిలో అనారోగ్యానికి గురైతే.. వైద్యం చేయటానికి తగిన ఏర్పాట్లు చేస్తారు. తొలుత 75 లక్షల మందికి టీకాల్ని అందజేయనున్నారు.

ఒక్కొక్కరికి రెండు డోసుల చొప్పున కోటిన్నర టీకాలు తొలుత రాష్ట్రానికి రానున్నాయి. టీకాల రవాణాకు ఇప్పటికే 16 ప్రత్యేక వాహనాల్ని సిద్ధం చేయగా.. మరో 17 వాహనాల్ని కొనుగోలు చేస్తున్నారు. టీకాలు వేసే సమయంలో చేతులకు వేసుకునే గ్లౌజ్ లు.. మాస్కులు.. ఇతరవస్తువులు భారీగా ఉండనున్నాయి. వీటిని స్టోర్ చేయటానికి ప్రధాన కార్యాలయంలో బిల్డింగ్ లను ఎంపిక చేశారు. మొత్తంగా సంక్రాంతి నాటికి టీకాలు సామాన్యులకు అందుబాటులోకి రానున్నాయని చెప్పక తప్పదు.