Begin typing your search above and press return to search.

భారత్ లో తగ్గుతున్న కరోనా జోరు ... కొత్తగా ఎన్నంటే

By:  Tupaki Desk   |   3 Dec 2020 6:20 AM GMT
భారత్ లో తగ్గుతున్న కరోనా జోరు ... కొత్తగా ఎన్నంటే
X
కరోనా వైరస్ మహమ్మారి జోరు దేశంలో కొనసాగుతుంది. ప్రతి రోజు కూడా పాజిటివ్ కేసులు నమోదు అవుతూనే ఉన్నాయి. భారత్ ‌లో కరోనా కేసులపై కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం విడుదల చేసిన బులెటిన్ ప్రకారం... గత 24 గంటల్లో 35,551 మందికి కరోనా మహమ్మారి నిర్ధారణ అయింది. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 95,34,965కి చేరింది. ఇక గత 24 గంటల్లో 40,726 మంది కోలుకున్నారు. ఇందులో 89,73,373 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 4,22,943 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.

ఇక దేశంలో ఇప్పటి వరకు 1,38,648 మంది కరోనాతో మృతి చేశారు. ఇక గడిచిన 24 గంటల్లో ఇండియాలో 40,726 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యినట్టు కరోనా బులెటిన్ లో వెల్లడించారు. కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 14,35,57,647 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి తెలిపింది. నిన్న ఒక్కరోజులోనే 11,11,698 శాంపిళ్లను పరీక్షించినట్లు తెలిపింది.

తెలంగాణలో గత 24 గంటల్లో 609 కరోనా కేసులు నమోదయ్యాయి. తెలంగాణ‌ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన కరోనా కేసుల వివరాల ప్ర‌కారం... గత 24 గంటల్లో ముగ్గురు కరోనాతో ప్రాణాలు కోల్పోగా, అదే సమయంలో 873 మంది కోలుకున్నారు. ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,71,492కి చేరింది. ఇప్పటి వరకు మొత్తం 2,61,028 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య మొత్తం 1,465కి చేరింది. తెలంగాణలో ప్రస్తుతం 8,999 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. వారిలో 6,922 మంది హోంక్వారంటైన్ లో చికిత్స తీసుకుంటున్నారు. జీహెచ్ ఎంసీ పరిధిలో కొత్తగా 114, రంగారెడ్డి జిల్లాలో 48 కరోనా కేసులు నమోదయ్యాయి.