Begin typing your search above and press return to search.
వ్యాక్సిన్ అందరికీ అక్కర్లేదు.. కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటన.. మండిపడుతున్న విపక్షాలు..!
By: Tupaki Desk | 2 Dec 2020 2:30 AM GMTకేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ షాకింగ్ ప్రకటన చేశాడు. దేశంలోని ప్రజలందరికీ కరోనా వ్యాక్సిన్ ఇవ్వాల్సిన అవసరం లేదని.. ఎంపిక చేసిన వాళ్లకు మాత్రమ ఇస్తే సరిపోతుందని వ్యాఖ్యానించాడు. రాజేశ్ భూషణ్ వ్యాఖ్యలు ఇటు ప్రజల్లో, అటు రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపాయి. రాజేశ్ భూషన్ ఏమన్నారంటే.. ‘ ప్రతి ఒక్కరికీ టీకా అందిస్తామని కేంద్ర ప్రభుత్వం ఎప్పుడూ చెప్పలేదు. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు భారీగా వ్యాక్సినేషన్ నిర్వహించాలి. అంతేకానీ ప్రతిమనిషికి ఇవ్వాల్సిన అవసరం లేదు.
కరోనా వ్యాప్తిని దేశంలో అరికట్టడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యం. టీకా సమర్థత ఆధారంగా వ్యాక్సినేషన్ మీద ఓ నిర్ణయం తీసుకుంటాం. సీరం ఇన్స్టిట్యూట్ తయారు చేస్తున్న వ్యాక్సిన్‌పై ఇప్పడైతే దుష్ప్రభావాలు ఏమీ లేవు’ అంటూ రాజేశ్ భూషణ్ వ్యాఖ్యానించారు. అయితే కేంద్రప్రభుత్వం తీరును విపక్షాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం వ్యాక్సిన్ అంశాన్ని రాజకీయంగా వాడుకుంటున్నదని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.
బిహార్ ఎన్నికల సమయంలో ప్రజలందరికీ వ్యాక్సిన్ ఇస్తామని ప్రకటించిన మోదీ సర్కార్ ఇప్పుడు మాట మారుస్తున్నదని వాళ్లు ఆరోపిస్తున్నారు.రెండ్రోజులు దేశవ్యాప్తంగా పర్యటించి వ్యాక్సిన్ పరిస్థితిని గమనించినట్టు ప్రధాని నరేంద్రమోదీ షో చేశారని వాళ్లు విమర్శించారు. కరోనా వ్యాక్సిన్‌ను రాజకీయాల కోసం వాడుకున్న బీజేపీ.. ఇప్పుడు మాత్రం మాట మారుస్తున్నదని ఆరోపించారు.