Begin typing your search above and press return to search.

దేశ జనాభాలో 7 శాతం మందికి కరోనా: ఐసీఎంఆర్!

By:  Tupaki Desk   |   27 Nov 2020 8:10 AM GMT
దేశ జనాభాలో 7 శాతం మందికి కరోనా: ఐసీఎంఆర్!
X
కరోనా మహమ్మారి జోరు దేశంలో ఉదృతంగా కొనసాగుతుంది. కరోనా వైరస్ ప్రభావం తగ్గిపోయింది అనుకుంటున్నారు కానీ , ఈ మహమ్మారి విజృంభణ మళ్లీ మొదలైంది. ప్రతి రోజు వేల కొద్ది కేసులు వెలుగులోకి వస్తున్నాయి. దేశ జనాభాలో దాదాపు 7 శాతం మంది ఆగస్టు నాటికి కరోనా బారినపడ్డారని ఐసీఎంఆర్ చేపట్టిన రెండో జాతీయ సెరో సర్వేలో తేటతెల్లం అయింది. పదేళ్లు, ఆపై వయసు పైబడినవారిలో 74.3 మిలియన్ల మంది ఆగస్టు నాటికి కరోనా బారినపడ్డారని సర్వే లో వెల్లడైంది.

సెరోప్రివెలెన్స్ అత్యధికంగా పట్టణాల్లోని మురికివాడల్లోనూ, తర్వాత నాన్-స్లమ్, గ్రామీణ ప్రాంతాలు ఉన్నాయి. లాన్సెట్ గ్లోబల్ హెల్త్ ప్రీ-ప్రింట్‌ లో ప్రచురించిన ఫలితాల ప్రకారం దేశంలో మొత్తం 10 శాతం కంటే తక్కువ మందిలో సెరోప్రెవలెన్స్ ఉందని, జనాభాలో ఎక్కువ భాగం కరోనా‌కు గురయ్యే అవకాశం ఉందని సూచిస్తుంది. టీకాలు వేయడం ద్వారా హెర్డ్ ఇమ్యూనిటీ సాధించే వరకు చాలా రాష్ట్రాల్లో మహమ్మారి వ్యాప్తి కొనసాగుతుందని భావిస్తున్నారు.. అయితే, విషయం గురించి పూర్తిగా తెలియకపోయినా 50 శాతంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు.

కరోనా కేసులతో సంబంధంలేని వ్యక్తులు, సార్స్-కోవి-2 పరీక్షలు చేయించుకోనివారిలో కరోనా యాంటీబాడీలు గుర్తించారు. కరోనా లక్షాలు బయటపడని వ్యక్తులను పరీక్షించడానికి వ్యూహాల విస్తరణకు మా డేటా మద్దతు ఇస్తుంది. సిరో పాజిటివ్ వ్యక్తులలో కేవలం 3 శాతం మంది మాత్రమే కరోనా లక్షణాల నిర్దేశిత పరిమితులు, సార్వత్రిక నివారణ పద్ధతుల ప్రాముఖ్యతను ఎత్తిచూపారని నివేదిక వెల్లడించింది. పదేళ్లు, ఆపై వయసు కలిగిన దాదాపు ప్రతి 15 మందిలో ఒకరు ఆగస్టు నాటికి కోవిడ్ బారినపడ్డారు.. మే నుంచి ఆగస్టు మధ్య యువతలో సెరో ప్రివిలెన్స్ 10 రెట్లు పెరిగింది. అయితే, మే నెలతో పోల్చితే ఆగస్టు నాటికి సంక్రమణ నిష్పత్తి తక్కువగా ఉంది. దేశవ్యాప్తంగా టెస్టింగ్ సామర్ధ్యం పెరగడమే దీనికి కారణం అని తెలిపింది. 2020 ఆగస్టులో నిర్ధారణ అయిన కేసులో 26–32 ఉంటే, మేలో 82-131 వరకు ఉన్నాయి.

తొలి దశ సెరోసర్వే నిర్వహించినప్పుడు పరీక్షల పెరుగుదల పరిణామాలు వ్యాధి పెరుగుదలను మించిపోయింది. సాధారణ ప్రాంతాల (17.4)తో పోల్చితే ముంబయి మురికివాడల్లో కోవిడ్ వ్యాధినిరోధకత (57.8 శాతం) చాలా ఎక్కువగా ఉంది. తొలి దశ సర్వేకు విరుద్దంగా ఈ ఫలితాలు గ్రామీణ జనాభాలోనూ మహమ్మారి ప్రసారాన్ని సూచిస్తున్నాయి అని నివేదిక పేర్కొంది. రాబోయే నెలల్లో గ్రామీణ ప్రాంతాల్లో వైరస్ వ్యాప్తి మరింత పెరుగుతుంది.. వైద్యఆరోగ్య సౌకర్యాలు కల్పించాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పింది.. ఇది కేసుల సమర్థవంతమైన నిర్వహణకు ఆరోగ్య సౌకర్యాలను బలోపేతం చేస్తుంది అని ఇది తెలిపింది .