Begin typing your search above and press return to search.

2.0 విధ్వంసం పూర్తి కాలేదు.. అప్పుడే 3.0 హెచ్చరికలు

By:  Tupaki Desk   |   23 Nov 2020 4:30 AM GMT
2.0 విధ్వంసం పూర్తి కాలేదు.. అప్పుడే 3.0 హెచ్చరికలు
X
ప్రపంచాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న కరోనా మహమ్మారి.. మొదటి వేవ్ చేసిన నష్టం నుంచి కోలుకోకముందే రెండో వేవ్ తో తీవ్రమైన విధ్వంసాన్ని క్రియేట్ చేస్తోంది. భారీగా నమోదవుతున్న కేసులతో.. అమెరికా.. యూరప్ దేశాలు ఈ కంటికి కనిపించని మహ్మారికి గజగజలాడిపోతున్నాయి. కరోనా క్రియేట్ చేసిన సంక్షోభం నుంచి కోలుకోముందే.. సెకండ్ వేవ్ తో విరుచుకుపడుతోంది. మొదటి వేవ్ తో పోలిస్తే.. సెకండ్ వేవ్ మరింత ప్రమాదకరంగా మారింది.

ఈ భయాలు ఇలా ఉంటే.. తాజాగా గుండెలు అదిరే మాటను చెప్పింది ప్రపంచ ఆరోగ్య సంస్థ. పలు దేశాల్ని సెకండ్ వేవ్ తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. ఇదిలా ఉంటే.. సెకండ్ వేవ్ విషయంలో ప్రజలు ప్రదర్శించిన ఉదాసీనత.. నిర్లక్ష్యం మూడో వేవ్ కు కారణమైందని.. ఇది అత్యంత ప్రమాదకరమని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది. కఠిన చర్యలతో వైరస్ వ్యాప్తిని అరికట్టలేకపోతే.. మూడో దశ ఖాయమని తేల్చి చెప్పింది.

ఇప్పటికి చాలా దేశాల్లో మొదటి వేవ్ పూర్తి కాలేదు. అంతలోనే సెకండ్ వేవ్ తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. ఆందోళన కలిగించేలా కొత్త కేసులు.. మరణాలు రేటు నమోదవుతుంది. దీంతో.. ప్రజలు.. ప్రభుత్వాలు ఆందోళనతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. ఇలాంటివేళలో కరోనా 3.0 విస్తరిస్తుందన్న విషయాన్ని డబ్ల్యూహెచ్ వో తాజాగా వార్నింగ్ ఇచ్చింది. ముఖ్యంగా యూరోప్ దేశాల్లో ఇది వ్యాప్తిస్తుందని చెబుతున్నారు. 2021 ఆరంభంలో వైరస్ తీవ్రస్థాయిలో విజృంభించే వీలుందని చెబుతున్నారు.

కరనా 2.0 వ్యాప్తిని అరికట్టటంలో యూరోపియన్ దేశాలు విఫలమయ్యాయని.. అందుకే వారు 3.0ను ఫేస్ చేయక తపపదంటున్నారు. నిజానికి 2.0 విస్తరిస్తున్న వేళ ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండి ఉంటే.. వైరస్ వ్యాప్తిని అడ్డుకునే అవకాశం ఉండేదని.. దాన్ని వారు చేజార్చుకున్నట్లుగా చెబుతున్నారు. ప్రస్తుతం ఉన్న అంచనాల ప్రకారం 2021 తొలినాళ్లలో మూడో దశ ఖాయమంటున్నారు. అదే జరిగితే అందుకు భారీ మూల్యం చెల్లించక తప్పదంటున్నారు.