Begin typing your search above and press return to search.

వ్యాక్సిన్లు వస్తున్నాయి సరే.. ఇంతకీ మనకు సెట్​ అయ్యేది ఏది?

By:  Tupaki Desk   |   22 Nov 2020 5:31 AM GMT
వ్యాక్సిన్లు వస్తున్నాయి సరే.. ఇంతకీ మనకు సెట్​ అయ్యేది ఏది?
X
కరోనా వ్యాక్సిన్​పై ఎంతో కాలంగా వార్తలు వస్తున్నాయి. ట్రయల్స్​ అన్ని సక్సెస్​ అయ్యాయి. అతి త్వరలో వ్యాక్సిన్​ వస్తుందంటూ పలు ఫార్మా కంపెనీలు ఊదరగొడుతున్నాయి. ఈ వ్యాక్సిన్ల వార్తలు చదివి ప్రజలకు విసుగొచ్చింది. రోజుకో కంపెనీ వ్యాక్సిన్​ వస్తుందంటూ పేర్లు బయటకు వచ్చాయి. అయితే మొదటి వ్యాక్సిన్​ మేమే కనిపెట్టామంటూ రష్యా ముందుకు వచ్చింది. అదే స్పుత్నిక్​-వీ. అయితే ఈ వ్యాక్సిన్​పై ఎన్నో అనుమానాలు వెల్లువెత్తాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న శాస్త్రవేత్తలు రష్యా వ్యాక్సిన్​పై అనుమానాలు వ్యక్తం చేశారు. ఎవరెన్ని అభ్యంతరాలు చెప్పినా రష్యా మాత్రం వ్యాక్సిన్​ ప్రజల్లోకి వదిలేసింది.

అయితే రష్యా వ్యాక్సిన్​తో మనదేశానికి చెందిన రెడ్డిల్యాబ్స్​ కూడా ఒప్పందం చేసుకున్నది. ఒకవేల భారత్​లో స్పుత్నిక్​వీ ట్రయల్స్​ సక్సెస్​ అయితే ఇక్కడ కూడా పంపిణీ ప్రారంభిస్తారు. అయితే రష్యా వ్యాక్సిన్​తో మరికొన్ని వ్యాక్సిన్​లు కూడా ఇప్పుడు క్లినికల్​ ట్రయల్స్​ ఆఖరి దశను పూర్తిచేసుకుంటున్నాయి. ఇందులో ప్రధానమైనవి ఆస్ట్రాజెనెకా, ఫైజర్, మోడెర్నా. ఆస్ట్రాజెనెకా టీకాను భారత్​కు చెందిన సీరం ఇన్​స్టిట్యూట్​ తయారు చేస్తున్నది. వీటితోపాటు భారత్ బయోటెక్ కోవ్యాక్సిన్‌ను అభివృద్ధి చేస్తున్నది. కానీ మోడెర్నా, ఫైజర్​ లాంటి వ్యాక్సిన్లు భారత్​లో అందుబాటులోకి రావడం కొంచెం కష్టమే.

మనదేశ ప్రజల ఆరోగ్యస్థితిగతులు, ఇక్కడి వాతావరణానికి సరిపోయే వ్యాక్సిన్లు ఏవని ప్రజలకు సందేహాలు తలెత్తుతున్నాయి. ఈ వ్యాక్సిన్లను ప్రభుత్వాలే ఉచితంగా సరఫరా చేస్తాయా.. లేక ప్రజలే కొనుగోలు చేయాలా అన్న విషయంపై ఇంకా క్లారిటీ లేదు. ఈ విషయంపై ప్రభుత్వాలే స్పందించాలి. ఆక్స్‌ఫర్డ్-ఆస్ట్రాజెనెకా .. సీరం ఇన్​స్టిట్యూట్​తో కలసి కోవిషీల్డ్​ వ్యాక్సిన్​ను తయారుచేస్తున్నాయి. సీరం ఇన్​స్టిట్యూట్, ఐసీఎంఆర్​తో కలిసి నోవావ్యాక్స్ అనే వ్యాక్సిన్​ ను తయారుచేస్తున్నది.

కోవ్యాక్సిన్, నోవావ్యాక్స్, కోవీషీల్డ్ భారత పరిస్థితులకు కరెక్ట్​గా సరిపోతాయని వైద్యులు, శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే మనదేశంలో ఉన్న ఆర్థికవనరులు, భద్రతాప్రమాణాలు తదితర విషయాల ఆధారంగా శాస్త్రవేత్తలు ఓ అంచనాకు వచ్చారు. నిజానికి అమెరికాలో తయారుచేస్తున్న ఫైజర్​ వ్యాక్సిన్​ అన్ని వ్యాక్సిన్ల కంటే ప్రభావవంతంగా పనిచేస్తున్నది. కానీ దాన్ని మనదేశంలో భద్రపరచడానికి అనువైన వాతావరణం లేదు.