Begin typing your search above and press return to search.
ఢిల్లీలో మళ్లీ మొదలైన కరోనా జోరు .. చలి - కాలుష్యమే కారణమట!
By: Tupaki Desk | 14 Nov 2020 8:10 AM GMTదేశ రాజధాని ఢిల్లీ లో మరోసారి కరోనా విజృంభణ మొదలైంది. ఈ మధ్య గత కొన్నిరోజులుగా వరుసగా నమోదు అయ్యే కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. గత బుధవారం ఒక్క రోజే దిల్లీలో 8,500 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు దిల్లీలో వైరస్ కారణంగా మరణించిన వారి సంఖ్య 7,000 చేరుకుంది. దీనితో మళ్లీ హాస్పిటల్స్ లో బెడ్స్ అన్ని కూడా నిండిపోయాయి. నగరంలోని ప్రభుత్వ ఆసుపత్రులలో బెడ్లను పెంచాల్సిందిగా ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కేంద్ర ప్రభుత్వానికి విజ్జప్తి చేశారు. దేశంలో ఇప్పటి వరకు నమోదైన కేసులు 86 లక్షలు దాటాయి. అత్యధిక కేసుల జాబితాలో భారత్ ప్రపంచంలో రెండోస్థానంలో నిలిచింది. మరోవైపు దేశవ్యాప్తంగా రోజువారీ నమోదవుతున్న కేసులు 40-50వేల మధ్య ఉన్నాయి.
ఇప్పటి వరకు దిల్లీలో 450,000 వేలకేసులు నమోదు కాగా, 42,000 కేసులను యాక్టివ్‌గా ఉన్నాయి. ఉత్తరాదిలో చలితోపాటే కాలుష్యం కూడా విపరీతంగా పెరుగుతుంది. ఈ రెండు అంశాలు వైరస్ నిరోధానికి పెద్ద సవాలుగా మారతున్నాయని నిపుణులు అంటున్నారు.
కేసుల సంఖ్య విపరీతంగా పెరిగి పోవడానికి పండగ సీజన్ కూడా ఒక కారణమే. దీపావళి పండగ ఉండటంతో షాపింగ్ రద్దీ బాగా పెరిగింది. కాలుష్యం సమస్య రాకుండా ఉండేందుకు దిల్లీ ప్రభుత్వం టపాకాయల అమ్మకాలను నిషేధించడంతోపాటు, భౌతికదూరం పాటించాలంటూ ప్రజలకు విజ్జప్తి చేసింది. అయితే, మార్కెట్లలో కనిపిస్తున్న జనాభా అధికారులను ఆందోళన కి గురిచేస్తుంది. దిల్లీలో మొత్తం 16,573 బెడ్లు కరోనా బాధితుల కోసం కేటాయించగా, బుధవారం నాటికి అందులో 8,600 బెడ్లు నిండిపోయాయని ప్రభుత్వం రూపొందించిన కరోనా యాప్ సూచిస్తోంది.
అంతకన్నా ఆందోళనకరమైన విషయం ఐసీయుల కొరత. కేవలం 176 బెడ్లకు మాత్రమే వెంటిలేటర్ సౌకర్యం ఉండగా, 338 బెడ్లకు ఆ సౌకర్యం లేదు. కేసులు పెరుగుతున్నాయంటే ఆసుపత్రులకు వచ్చే కోవిడ్ పేషెంట్ల సంఖ్య విపరీతంగా పెరిగే అవకాశం ఉందని ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) డైరక్టర్ డాక్టర్ రణ్‌దీప్ గులేరియా అన్నారు. చలి కాలంలో రోగ నిరోధక శక్తి కూడా తగ్గుతుందని, ఇది మరో ప్రమాదకరమైన అంశమని పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ ప్రొఫెసర్ కె. శ్రీనాథ్ రెడ్డి అన్నారు. చలి కారంణంగా వైరస్ బతికే కాలం ఎక్కువగా ఉంటుందని, చల్లని, పొడి వాతావరణం ఈ వైరస్ కు చాలా అనుకూలమని శ్రీనాథ్ రెడ్డి వెల్లడించారు. గాలిలో కలిసే నైట్రోజన్ ఆక్సైడ్‌లు, కార్ల నుంచి వెలువడే పొగకు కోవిడ్ ఇన్ఫెక్షన్ పెరుగుదలకు సంబంధం ఉంటుందని కేంబ్రిడ్జి యూనివర్సిటీ నిర్వహించిన పరిశోధన వెల్లడించింది. చలికాలంలో ఈ వైరస్ ను ఎదుర్కోవడం మనకు ఇదే మొదటిసారి. ఎండాకాలం నాటి పరిస్థితులు ఇప్పుడు కచ్చితంగా ఉండవు. మనం ఇప్పుడు చాలా బలహీన స్థితిలో ఉన్నాం అని అన్నారు శ్రీనాథ్ రెడ్డి.