Begin typing your search above and press return to search.
కరోనా రూపం మార్చుకుంటున్నది.. వ్యాక్సిన్లు వచ్చినా వేస్టేనా!
By: Tupaki Desk | 7 Nov 2020 10:00 PM ISTకరోనా వైరస్ తన జన్యుపరం గా తన రూపాన్ని మార్చుకొని విజృంభించబోతుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఒకవేళ వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినా ఈ కొత్త కరోనా వైరస్ పై ప్రభావం చూపక పోవచ్చని నిపుణులు అంటున్నారు. ఇప్పటికే కరోనా సెకండ్‌వేవ్‌కు సిద్ధంగా ఉండాలని డబ్ల్యూహెచ్‌వో ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతోపాటు రూపాన్ని మార్చుకొని వచ్చే ఈ కరోనా వైరస్‌పై ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కరోనా వైరస్ తన జన్యుక్రమాన్ని మార్చకోబోతున్నదని ఇప్పటికే పలు అధ్యయనాలు చెప్పాయి.
తాజాగా, వైరస్‌లో కొత్త మార్పులు చోటు చేసుకొన్నట్లు శాస్త్రవేత్తలు వెల్లడించారు. డెన్మార్క్‌లో మింక్ అనే జీవి నుంచి ఈ వైరస్ మనుషులకు వ్యాపిస్తున్నట్లు ఆ దేశానికి చెందిన ది స్టేటెన్స్ సీరమ్ ఇన్‌స్టిట్యూట్ శాస్త్రవేత్తలు గుర్తించారు. అప్రమత్తమైన డెన్మార్క్ ప్రభుత్వం ఆ దేశంలో ఆంక్షలను విధించింది. ఈ ప్రాంతంలో వందల కొద్దీ ఫారమ్‌లలో మింక్‌లను పెంపకం చేపట్టారు. ఉత్తర డెన్మార్క్‌లో కోవిడ్-19 ఆంక్షలు నవంబరు 7 నుంచి అమల్లోకి వస్తాయని ప్రధాని మెట్టీ ఫ్రెడ్రెక్సన్ ప్రకటించారు. జన్యుమార్పిడి ద్వారా మింక్ నుంచి వ్యాపించే వైరస్‌తో ప్రపంచం తీవ్ర ముప్పును ఎదుర్కోనుందని అన్నారు. అయితే ఉత్తరడెన్మార్క్లోని 207 మింక్ ఫారమ్స్‌లో కొత్త రకం కరోనా వైరస్ ను గుర్తించారు. మొదట్లో దీనిని గుర్తించడంలో అధికారులు విఫలమయ్యారు. ఈ ప్రాంతంలోని దాదాపు 1,100 ఫారమ్స్‌లో సుమారు 1.7కోట్ల మింక్‌లకు వైరస్ ముప్పు ఏర్పడింది. తాజాగా ఐదు మింక్ కేంద్రాల్లోని 12 మందికి వైరస్ నిర్ధారణ అయ్యింది. జూన్ నుంచి ఇప్పటి వరకు 214 మందికి వైరస్ సోకినట్లు ది స్టేటెన్స్ సీరమ్ ఇన్‌స్టిట్యూట్ నివేదికలో పేర్కొంది.