Begin typing your search above and press return to search.

సెకండ్​ వేవ్​ టైంలో ఇది నిజంగా గుడ్​న్యూసే!

By:  Tupaki Desk   |   5 Nov 2020 4:00 AM GMT
సెకండ్​ వేవ్​ టైంలో  ఇది నిజంగా గుడ్​న్యూసే!
X
దేశంలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతున్నప్పటికీ.. సెకండ్​ వేవ్​ ముంచుకొస్తుందన్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇప్పటికే కేరళ, ఢిల్లీ రాష్ట్రాల్లో కరోనా సెకండ్​ వేవ్​ మొదలైంది. మిగిలిన రాష్ట్రప్రభుత్వాలు కూడా అలర్ట్​గా ఉండాలంటూ ప్రజలకు ఆదేశాలు జారీచేశాయి. ఢిల్లీలో సెకండ్​ వేవ్​ కాదు థర్డ్​వేవ్​ వచ్చిందంటూ.. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్​ కేజ్రీవాల్​ ప్రకటించారు. కేంద్ర ఆరోగ్య శాఖ లెక్కల ప్రకారం బుధవారం కొత్తగా 46,254 కేసులు, 514 మరణాలు నమోదయ్యాయి. బుధవారం సాయంత్రానికి తాజా లెక్కలు కలిపి దేశంలో మొత్తం కేసుల సంఖ్య 83.53లక్షలకు, మరణాల సంఖ్య 1.24లక్షలకు పెరిగింది. ఈ క్రమంలో కరోనా వ్యాక్సిన్​ అభివృద్ధి చేసిన ప్రఖ్యాత సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా(ఎస్ఐఐ) శుభవార్త తెలిపింది. జనవరిలో కరోనా వ్యాక్సిన్​ అందుబాటులోకి తీసుకొస్తామంటూ ప్రకటించింది. బ్రిటిష్-స్విడిష్ ఫార్మా దిగ్గజం ఆస్ట్రాజెనికా, ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీతో కలిసి ‘కొవిషీల్డ్' పేరుతో సీరం సంస్థ వ్యాక్సిన్​ తయారు చేస్తున్న విషయం తెలిసిందే.


ఆక్స్ ఫర్డ్-ఆస్ట్రాజెనెకాకు భాగస్వామిగా ఉన్న సీరం సంస్థ.. భారత్ సహా అల్పాదాయం ఉన్న దేశాలకు కొవిడ్-19 వ్యాక్సిన్ అందించే ఉద్దేశంతో ప్రయోగాలు తలపెట్టడం విదితమే. ప్రస్తుతం భారత్ లో ఎంపిక చేసిన 17 నగరాల్లో 1600 మంది వాలంటీర్లపై ‘కొవిషీల్డ్' వ్యాక్సిన్ ను ప్రయోగిస్తున్నారు. ఫేజ్2తోపాటు ఫేజ్3 క్లినికల్ ట్రయల్స్ కూడా విజయవంతంగా సాగుతున్నాయని సీరం సంస్థ సీఈవో అధర్ పూనావాలా తెలిపారు. సురక్షితమైన, సమర్థవంతమైన కొవిడ్‌-19 వ్యాక్సిన్ వచ్చే ఏడాది జనవరిలోనే అందుబాటులోకి వస్తుందని ఆయన బుధవారం ప్రకటించారు. అయితే.. కొవిషీల్డ్ వ్యాక్సిన్ కు సంబంధించి భారత్ సహా బ్రిటన్ లో ఫేజ్-2, ఫేజ్-3 క్లినికల్ ట్రయల్స్ విజయవంతం అయినప్పటికీ, ప్రభుత్వ నియంత్రణ సంస్థల నుంచి ఆమోదం రాలేదు. అనుమతులు వస్తే జనవరిలో అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సంస్థ యత్నిస్తున్నది. ధర కూడా అందరికీ అందుబాటులో ఉండేవిధంగా చూస్తామని సంస్థ యాజమాన్యం తెలిసింది.