Begin typing your search above and press return to search.

వ్యాక్సిన్​ పంపిణీకి సిద్ధం కండి.. రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం.. అంతలోనే ట్విస్ట్​

By:  Tupaki Desk   |   31 Oct 2020 2:50 PM GMT
వ్యాక్సిన్​ పంపిణీకి సిద్ధం కండి.. రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం.. అంతలోనే ట్విస్ట్​
X
కరోనా వ్యాక్సిన్​ పంపిణీకి సిద్ధం కావాలంటూ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. అయితే నిజానికి వ్యాక్సిన్​ ఇంకా అందుబాటులోకి రాలేదు. ట్రయల్స్​ దశలోనే ఉన్నది. కానీ చాలా దేశాల్లో వ్యాక్సిన్​పై రాజకీయాలు మొదలుపెట్టారు. నవంబర్​ 1లోగా దేశప్రజలందరికీ వ్యాక్సిన్​ పంపిణీ చేస్తామంటూ ట్రంప్​ ప్రగల్భాలు పలికారు. కానీ ఆచరణలో అది సాధ్యం కాలేదు. దీంతో ట్రంప్​ అబాసుపలయ్యారు. అంతకుముందు రష్యా కూడా మేమే ప్రపంచంలో తొలి వ్యాక్సిన్​ కనిపెట్టామని ప్రజలకు పంపిణీ చేయబోతున్నామని ప్రకటించింది. కానీ మూడో దశ ట్రయల్స్​ తేడా కొట్టడంతో ప్రస్తుతం వ్యాక్సిన్​ పంపిణీ గురించి ఆ దేశం ఏమీ మాట్లాడటం లేదు. వ్యాక్సిన్​ పంపిణీ పలు దేశాలకు ఎన్నికల ఆయుధంగా మారింది. మనదేశంలో సైతం అదే పరిస్థితి నెలకొన్నది. బీహార్​ ఎన్నికల్లో తాము గెలిస్తే వ్యాక్సిన్​ పంపిణీ చేస్తామంటూ ఎన్డీఏ ప్రకటించింది. దీంతో దేశవ్యాప్తంగా విమర్శలు వచ్చాయి.

ఒక్క బీహార్​కు పంపిణీ చేస్తే మా పరిస్థితి ఏమిటంటూ పలు రాష్ట్రాలకు చెందిన ప్రాంతీయపార్టీలు, కాంగ్రెస్​ పార్టీ సైతం ప్రశ్నించింది. దీంతో దేశప్రజలందరికీ ఉచితంగా వ్యాక్సిన్​ పంపిణీ చేస్తామంటూ ప్రధాని మోదీ నేరుగా ప్రకటించారు. అయితే మళ్లీ వ్యాక్సిన్​ పంపిణీపై కేంద్రం హాడావిడి మొదలు పెట్టింది. వ్యాక్సిన్ పంపిణీకి రెడీగా ఉండాలని కేంద్రం అన్ని రాష్ట్రాలను ఆదేశించింది. అందులో ఓ ట్విస్ట్​ ఉంది.. వ్యాక్సిన్​ ఇంకా అందుబాటులోకి రాలేదు. ఒక వేళ వస్తే కరోనా వ్యాక్సిన్‌ వస్తే వెంటనే దాన్ని దేశవ్యాప్తంగా పంపిణీ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ క్రమంలోనే వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ను సమన్వయం, పర్యవేక్షణ కోసం కమిటీలను ఏర్పాటు చేసుకోవాలని అన్ని రాష్ట్రాలకు సూచించింది. వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కొనసాగే సమయంలో ఇతర ఆరోగ్య సేవలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని రాష్ట్రాలకు కేంద్రం తెలిపింది. ఈ మార్గదర్శకాల మీద అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర ఆరోగ్య శాఖ లేఖ రాసింది. అయితే వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుంది అనే విషయం మీద మాత్రం ఇంకా క్లారిటీ లేదు.