Begin typing your search above and press return to search.

కరోనా లేటెస్ట్ అప్డేట్ : దేశంలో 81 లక్షలు దాటిన కేసులు ..కొత్తగా ఎన్నంటే ?

By:  Tupaki Desk   |   31 Oct 2020 8:50 AM GMT
కరోనా లేటెస్ట్ అప్డేట్ : దేశంలో 81 లక్షలు దాటిన కేసులు ..కొత్తగా ఎన్నంటే ?
X
ఇండియా లో కరోనా మహమ్మారి జోరు కొనసాగుతూనే ఉంది. ప్రతిరోజూ కూడా వేల సంఖ్యల్లో కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. తాజాగా కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం బులిటెన్ విడుదల చేసింది. గత 24 గంటల్లో 48,268 మందికి కరోనా నిర్ధారణ అయిందని పేర్కొంది. అదే సమయంలో 59,454 మంది కోలుకున్నారు. దీంతో దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 81,37,119 కి చేరింది. గ‌త 24 గంట‌ల సమయంలో 551 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,21,641 కి పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 74,32,829 మంది కోలుకున్నారు. 5,82,649 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌ లలో చికిత్స అందుతోంది.

దేశంలో కరోనా మరణాల రేటు 1.5 శాతంగా ఉంది. ప్రపంచ దేశాల్లో అది 2.6 శాతంగా ఉంది. నిన్న ఇండియాలో 10,67,976 టెస్టులు చేశారు. మొత్తం టెస్టుల సంఖ్య 10కోట్ల 87లక్షల 96వేల 64కి చేరింది. ఇకపోతే , దేశంలో ఢిల్లీలో మళ్లీ కేసులు ఎక్కువగా నమోదవుతుండటం ఒకింత ఆందోళన కలిగిస్తోంది. ఐతే... ఢిల్లీలో 28 రోజులుగా కొత్త కేసుల కంటే రికవరీలే ఎక్కువగా ఉంటున్నాయి. ఇది మంచి పరిణామం. ఇండియాలో 10 రోజులుగా కరోనా మరణాలు వెయ్యి కంటే తక్కువ నమోదవుతున్నాయి. అలాగే... ఐదు రోజులుగా... కొత్త కేసులు 50వేల కంటే తక్కువే నమోదవుతున్నాయి. అమెరికాలో కొత్త కేసులు ఒకే రోజులో లక్షకు పైగా అంటే 1.05 లక్షలు నమోదయ్యాయి. ప్రపంచంలో లక్షకు పైగా కరోనా కేసులు నమోదైన దేశం అమెరికాయే.

ఇండియాలో సెప్టెంబర్ 17న అత్యధికంగా 97.9 వేల కరోనా కేసులొచ్చాయి. యూరప్ ఖండంలో ప్రస్తుతం రోజూ 3 లక్షల దాకా కొత్త కేసులొస్తున్నాయి. ఫ్రాన్స్ లో 49.2వేల కొత్త కేసులొచ్చాయి. యాక్టివ్ కేసుల్లో అమెరికా, ఫ్రాన్స్ తర్వాత ఇండియా 3వ స్థానంలో ఉంది.ప్రస్తుతం మొత్తం పాజిటివ్ కేసుల్లో అమెరికా టాప్‌లో కొనసాగుతోంది. ఆ తర్వాత ఇండియా, బ్రెజిల్, రష్యా, ఫ్రాన్స్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. రోజువారీ కొత్త కేసుల్లో అమెరికా, ఫ్రాన్స్, ఇండియా, ఇటలీ, స్పెయిన్ టాప్ 5లో ఉన్నాయి. మొత్తం మరణాల్లో అమెరికా టాప్‌లో ఉండగా... బ్రెజిల్, ఇండియా, మెక్సికో, బ్రిటన్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. రోజువారీ మరణాల్లో అమెరికా టాప్‌లో ఉంది.