Begin typing your search above and press return to search.
భారత్ కరోనా అప్డేట్ : 24 గంటల్లో 49,881 కేసులు , 517 మరణాలు
By: Tupaki Desk | 29 Oct 2020 8:30 AM GMTభారతదేశంలో కరోనా మహమ్మారి జోరు కొనసాగుతూనే ఉంది. కొన్ని రోజులు తగ్గినట్లు అనిపించినా కూడా , ఆ తర్వాత మళ్లీ కేసుల్లో పెరుగుదల కనిపిస్తుంది. ఒకరోజు ఎక్కువగా, ఒకరోజు తక్కువగా కేసులు నమోదు అవుతున్నాయి. ఇక తాజాగా గత 24 గంటల్లో 49,881 కరోనా కేసులు నమోదయ్యాయి. దీనితో మొత్తం కేసుల సంఖ్య 80,40,203కి చేరింది. నిన్న ఒక్క రోజే 517 మంది మరణించగా ఇప్పటివరకు మొత్తం 1,20,527 మంది కరోనాతో మృత్యువాతపడ్డారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గురువారం కరోనాపై హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.
నిన్న 56,480 మంది కోలుకుని ఆసుపత్రులనుంచి డిశ్చార్జ్ అవ్వగా ఇప్పటి వరకు మొత్తం 73,15,989 మంది కోలుకున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా యాక్టివ్ కేసుల సంఖ్య 6,03,687గా ఉంది. బుధవారం రోజున దేశవ్యాప్తంగా 10,75,760 శాంపిల్స్‌ను పరీక్షించారు. దీంతో ఇప్పటివరకు నిర్వహించిన కరోనా టెస్టుల సంఖ్య 10,65,63,440కి చేరింది.
ఇక తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన కరోనా కేసుల వివరాల ప్రకారం.. రాష్ట్రంలో గత 24 గంటల్లో కొత్తగా 1,504 కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో ఐదుగురు కరోనాతో ప్రాణాలు కోల్పోగా, 1,436 మంది కోలుకున్నారు. ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,35,656 కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 2,16,353 మంది డిశ్చార్జ్ అయ్యారు. మృతుల సంఖ్య మొత్తం 1,324 కి చేరింది. ప్రస్తుతం 17,979 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. వారిలో 14,938 మంది హోంక్వారంటైన్ లో చికిత్స పొందుతున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 288 కరోనా కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో మొత్తం 115 కేసులు నిర్ధారణ అయ్యాయి.