Begin typing your search above and press return to search.
కరోనా: ప్రపంచవ్యాప్తంగా 44 మిలియన్లకు చేరువలో కేసులు
By: Tupaki Desk | 27 Oct 2020 6:30 AM GMTప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. కొన్నిదేశాల్లో అయితే కరోనా స్వైర విహారం చేస్తోంది. రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య, మరణాల సంఖ్య పెరుగుతూనే ఉంది.
ప్రపంచవ్యాప్తంగా నిన్న ఒక్కరోజే 4,11,373 పాజిటివ్ కేసులు.. 5110 మరణాలు సంభవించాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 4,37,77,188కి చేరింది. అలాగే ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 1,164,516 మంది కరోనాతో మృతిచెందారు. ఇక ఇప్పటిదాకా 32,182,181 మంది కరోనా నుంచి కోలుకున్నారు.
అమెరికాలో కరోనా వైరస్ విస్తృతి కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం అమెరికాలో మొత్తం కేసుల సంఖ్య 89,62,783కి చేరింది. ఈ వైరస్ వల్ల ఇప్పటివరకు అమెరికాలో 2,31,045 మంది మృతి చెందారు.
ఇక బ్రెజిల్ - రష్యా - కొలంబియా - పెరు - స్పెయిన్ - మెక్సికోలో కరోనా తీవ్రత ఎక్కువగా ఉంది. అక్కడ వేలల్లో కేసులు నమోదవుతున్నాయి.
*భారత్ లో తగ్గుతున్న కరోనా
గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 36,469 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్యశాఖ మంగళవారం విడుదల చేసిన బులిటెన్‌లో పేర్కొంది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 79,46,429 కు చేరింది. ఇక నిన్న ఒక్కరోజే 488 మంది వైరస్ సోకి మరణించారు. దీంతో 1,19,502 కి మరణాల సంఖ్యకు చేరుకుంది.
ప్రస్తుతం దేశంలో 6,25,857 యాక్టివ్ కేసులు ఉండగా.. 72,01,070 మంది వైరస్ నుంచి కోలుకున్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. కాగా 24 గంటల్లో 63,842 మంది డిశ్చార్జ్ అయ్యారు.
*తెలంగాణలో కొత్తగా 837కరోనా కేసులు
గడిచిన 24 గంటల్లో తెలంగాణలో కొత్తగా 837కరోనా కేసులు నమోదయ్యాయని తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. నిన్న ఒక్కరోజే నలుగురు మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు కేసుల సంఖ్య 2,32,671 గా ఉంది. ఇక మరణాల సంఖ్య 1,315గా ఉన్నట్లు బులిటెన్ లో పేర్కొంది. ఇక ఇప్పటి వరకు 2,13,466 మంది కోలుకోగా ప్రస్తుతం 17,890 యాక్టివ్ కేసులు ఉన్నాయి. వీరిలో 14,851 ఇంట్లోనే చికిత్స తీసుకుంటున్నారు.