భారతదేశంలో కరోనా మహమ్మారి కేసులు ఒకరోజు తగ్గుతూ , మరో రోజు పెరుగుతూపోతున్నాయి. అయితే గతంలో రోజుకి లక్ష కి పైగా , లక్ష వరకు పాజిటివ్ కేసులు నమోదు కాగా , ఈ మధ్య ఆ సంఖ్య 50 వేలకి పడిపోయింది. ఇది శుభపరిణామం. అయితే , ఏ మాత్రం అలసత్వం వహించినా కూడా మళ్లీ సెకండ్ వేవ్ ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే ప్రపంచంలోని పలు దేశాలు సెకండ్ వేవ్ కరోనాతో దిక్కుతోచని స్థితిలో ఉన్నాయి. ఇక తాజాగా దేశంలో కరోనా కేసుల సంఖ్యపై కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ బులిటెన్ విడుదల చేసింది. గత 24 గంటల్లో 54,366 మందికి కరోనా నిర్ధారణ అయిందని తెలిపింది.
అలాగే గత , 24 గంటల సమయంలో 73,979 మంది కోలుకున్నారు. దీంతో దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 77,61,312 కి చేరింది. గత 24 గంటల సమయంలో 690 మంది కరోనా కారణంగా మృతువాత పడ్డారు. దీంతో మృతుల సంఖ్య 1,17,306 కి పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 69,48,497 మంది కోలుకున్నారు. 6,95,509 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్ లలో చికిత్స అందుతోంది. కాగా, దేశంలో కరోనా పరీక్షల సంఖ్య పది కోట్లు దాటడం గమనార్హం. నిన్నటి వరకు మొత్తం 10,01,13,085 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి వెల్లడించింది. నిన్న ఒక్కరోజులోనే 14,42,722 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.
ఇక , తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన కరోనా కేసుల వివరాల ప్రకారం.. రాష్ట్రంలో గత 24 గంటల్లో కొత్తగా 1,421 కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో ఆరుగురు కరోనాతో ప్రాణాలు కోల్పోగా, 1,221 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,29,001 కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 2,07,326 మంది డిశ్చార్జ్ అయ్యారు. మృతుల సంఖ్య మొత్తం 1,298 కి చేరింది. ప్రస్తుతం 20,377 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. వారిలో 17,214 మంది హోంక్వారంటైన్ లో చికిత్స పొందుతున్నారు.