Begin typing your search above and press return to search.

లేటెస్ట్ కరోనా అప్డేట్ : దేశంలో మరో 63,371 కేసులు !

By:  Tupaki Desk   |   16 Oct 2020 9:30 AM GMT
లేటెస్ట్ కరోనా అప్డేట్ : దేశంలో మరో  63,371 కేసులు !
X
దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి జోరు కొనసాగుతూనే ఉంది. రోజు రోజుకీ నమోదు అవుతున్న కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తుంది. నిన్నటితో పోల్చితే కాస్త తక్కువమందికి కరోనా నిర్ధారణ అయ్యినట్లు అధికారు చెబుతున్నారు. భారత్‌ లో గడిచిన 24 గంటల్లో 63,371 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 73,70,469కి చేరింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ కరోనాపై హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.నిన్న 70,338 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కోలుకున్నవారి సంఖ్య 64,53,780గా నమోదైంది.

ఇకపోతే , ప్రస్తుతం దేశంలో 8,04,528 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. గురువారం రోజున దేశవ్యాప్తంగా 10,28,622 శాంపిల్స్‌ను పరీక్షించారు. దీంతో ఇప్పటివరకు నిర్వహించిన కరోనా టెస్టుల సంఖ్య 9,22,54,927కి చేరింది.కొత్తగా 895 మంది కరోనాతో మృతిచెందారు. దీంతో దేశంలో మొత్తం కరోనా మృతుల సంఖ్య 1,12,161కి చేరింది. దేశంలో గత కొన్ని రోజులుగా కరోనా కేసులు తగ్గుతూ వస్తున్నాయి. మరోవైపు దేశంలో కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య పెరుగుతుంది. దేశంలో దాదాపు 87.56 శాతం కరోనా రికవరీ రేటు ఉన్నట్టు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. మరోవైపు రికవరీ రేటు క్రమంగా పెరుగుతూ వస్తుంది. దాదాపు 87.56 శాతం మంది కరోనా నుంచి కోలుకుంటున్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. మొత్తం కేసుల్లో కేవలం 10.92 శాతం మాత్రమే యాక్టివ్‌ కేసులు ఉన్నట్లు తెలిపింది. మరణాల రేటు 1.52 శాతానికి తగ్గిందని బులిటెన్ ‌లో వెల్లడించింది.