Begin typing your search above and press return to search.

దేశంలో 73 లక్షలు దాటిన పాజిటివ్ కేసులు ..కొత్తగా ఎన్నంటే ?

By:  Tupaki Desk   |   15 Oct 2020 9:45 AM GMT
దేశంలో 73 లక్షలు దాటిన పాజిటివ్ కేసులు ..కొత్తగా ఎన్నంటే ?
X
భారత్ లో కరోనా వైరస్ మహమ్మారి పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకి పెరుగుతూనే ఉంది. అయితే , ఒకప్పుడు పాజిటివ్ కేసుల సంఖ్య దాదాపుగా లక్ష వరకు ఉండగా .. అది ఈ మధ్య కాలంలో 60 నుండి 70 వేల మధ్యకి దిగొచ్చింది. ఇండియాలో గడిచిన 24 గంటల్లో 67,708 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 73,07,098కి చేరింది. నిన్న భారత్‌ లో కరోనా తో 680 మంది మృతి చెందగా.. మొత్తం కరోనా మృతుల సంఖ్య 1,11,266గా నమోదైంది. ఇక, దేశంలో కరోనా టెస్టుల సంఖ్య 9,12,26,305కి చేరింది. నిన్న ఒక్క రోజే 11,36,183 శాంపిల్స్‌ను పరీక్షించారు. గడిచిన 24 గంటల్లో 8,12,390 కోలుకో గా..మొత్తం రికవరీల సంఖ్య 63లక్షల 83వేల 442కు పెరిగింది.

ఇక , కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ, రికవరీల సంఖ్య కూడా భారీగా పెరుగుతుంది. ప్రస్తతం దేశంలో రికవరీ రేటు 87.36% ఉండగా, డెత్ రేటు 1.52% గా ఉంది. ప్రపంచ దేశాల్లో కోవిడ్ కేసుల సంఖ్య పరంగా భారత్ రెండో స్థానంలో ఉంది. ఈ జాబితాలో అమెరికా ఫస్ట్ ప్లేసులో ఉంది. అయితే రోజువారి నమోదయ్యే కేసుల విషయంలో మాత్రం భారత్ మొదటి స్థానంలో ఉంది.

ఇక , తెలంగాణలో తాజాగా 1,432 కరోనా ‌ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన కేసుల సంఖ్య 2,17,670కి చేరుకుంది. నిన్న ఒక్క రోజే కరోనా బారినపడి 8 మంది ప్రాణాలను కోల్పోయారు. దీంతో ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 1,249కి చేరిందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ గురువారం ఉదయం బులిటెన్‌ విడుదల చేసింది. ఇక కరోనా నుంచి కోలుకుంటున్నవారి సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. నిన్న 1,949 మంది కరోనా వైరస్ నుంచి కోలుకుని ఇళ్లకు చేరుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కోలుకున్న బాధితుల సంఖ్య 1,93,218కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 23,203 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. వీరిలో 19,084 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు.