Begin typing your search above and press return to search.

కరోనాను లైట్ ​గా తీసుకోకండి..వ్యాక్సిన్​ వచ్చే వరకు జాగ్రత్తలు తప్పవు..మోదీ సూచన

By:  Tupaki Desk   |   13 Oct 2020 8:30 PM IST
కరోనాను లైట్ ​గా తీసుకోకండి..వ్యాక్సిన్​ వచ్చే వరకు జాగ్రత్తలు తప్పవు..మోదీ సూచన
X
దేశంలో కరోనా వ్యాప్తి తగ్గుతున్న వేళ ప్రధాని నరేంద్ర మోదీ కీలక సూచనలు చేశారు. ప్రజలు కరోనాను లైట్​గా తీసుకొవద్దని.. వ్యాక్సిన్​ వచ్చే వరకు జాగ్రత్తలు పాటించాల్సిందేనని పేర్కొన్నారు. భారత్‌లో ఈరోజు కరోనా కేసులు తక్కువగానే నమోదయ్యాయి. దీనిపై పత్రికల్లో, సోషల్ మీడియాలో ఇటువంటి వార్తలు రెండు రోజులుగా విస్తృత ప్రచారంలోకి వచ్చాయి.

కరోనా కేసులు తగ్గినా సరే జాగ్రత్తలు తప్పవని ప్రధాని హెచ్చరించారు. మంగళవారం ఆయన కేంద్ర మాజీ మంత్రి బాలాసాహెబ్‌ విఖే పాటిల్‌ ఆత్మకథను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘వ్యాక్సిన్‌ వచ్చే వరకూ అప్రమత్తత తప్పదు. భౌతిక దూరం పాటించాల్సిందే. కోవిడ్‌-19 నిబంధనలు విధిగా పాటించాలి. వైరస్‌ ఇప్పటికీ వెంటాడుతూనే ఉన్నది. మాస్క్‌లు వేసుకోవడం, భౌతిక దూరం పాటించడంలో కొందరు అలసత్వం చూపుతున్నారు.

ఇది ఏమాత్రం తగదు. కరోనా ప్రమాదం కొనసాగుతోందని.. మహారాష్ట్రలో పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉన్నది’ అని ప్రధాని సూచించారు. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 55,342 కొత్త కేసులు నమోదయాయి. గత రెండునెలల కాలంలో ఇంత తక్కువస్థాయిలో కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. గత నెలలో 90,000కు పైగా కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య నమోదవగా తాజాగా ఆ సంఖ్య సగానికి పడిపోయింది. తాజా కేసులతో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 71.75 లక్షలకు చేరింది. ఇప్పటివరకు 1,09,856 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు.