Begin typing your search above and press return to search.
దేశంలో కరోనా విజృంభణ.. 70 లక్షలకి చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య !
By: Tupaki Desk | 9 Oct 2020 7:00 AM GMTఇండియా లో కరోనా మహమ్మారి కేసులు స్థిరంగా నమోదు అవుతూనే ఉన్నాయి. గత కొద్దిరోజుల క్రితం వరకు లక్ష వరకు నమోదు అయిన పాజిటివ్ కేసులు , ఇప్పుడు 70 వేల మధ్యలో నమోదు అవుతున్నాయి. ఇక తాజాగా గత 24 గంటల్లో 70,496 మందికి కరోనా నిర్ధారణ అయిందని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ కేసులతో కలిపి ,మొత్తం దేశంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 69,06,152 కి చేరింది.గత 24 గంటల సమయంలో 964 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,06,490 కి పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 59,06,070 మంది కోలుకున్నారు. 8,93,592 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. కాగా, దేశంలో నిన్న ఒక్కరోజులోనే 11.6 లక్షలకు పైగా శాంపిళ్లను పరీక్షించినట్లు ఐసీఎంఆర్ పేర్కొంది.
తాజాగా ప్రభుత్వం ప్రకటించిన బులిటెన్ ప్రకారం ..తెలంగాణ రాష్ట్రంలో గత 24 గంటల్లో కొత్తగా 1,891 కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో7 మంది కరోనా మహమ్మారితో పోరాడుతూ , కరోనాను ఎదుర్కోలేక ప్రాణాలు కోల్పోయారు. అలాగే , మరో 1,878 మంది కరోనా నుండి కోలుకున్నారు.ఇక తెలంగాణ రాష్ట్రంలో తాజాగా నమోదైన పాజిటివ్ కేసులతో కలిపి మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,08,535 కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 1,80,953 మంది డిశ్చార్జ్ అయ్యారు. అలాగే కరోనా మృతుల సంఖ్య మొత్తం 1,208 కు చేరింది. ప్రస్తుతం 26,374 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు.
ఇక , ఏపీలో నిన్న కొత్తగా 5,292 పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి. తాజాగా 6,102 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇక, రాష్ట్రంలో 42 మంది మృత్యువాత పడ్డారు. మొత్తం మరణాల సంఖ్య 6,128కి పెరిగింది. ఇప్పటివరకు 7,39,719 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 6,84,930 మందికి కరోనా నయం అయింది. ఇంకా 48,661 మంది చికిత్స పొందుతున్నారు.