Begin typing your search above and press return to search.
మాకు లాక్‌డౌన్ వద్దంతే..! ఊపందుకున్న ఉద్యమం
By: Tupaki Desk | 9 Oct 2020 5:30 AM GMTకరోనా ఎఫెక్ట్‌తో ప్రపంచదేశాలన్నింటికి లాక్‌డౌన్ తప్ప మరో మార్గం లేదు. అయితే ఈ లాక్‌డౌన్‌తో ఎంతోమంది యువత నష్టపోయారు. ఉపాధి కోల్పోయారు. ప్రజల ఆరోగ్యం దృష్ట్యా లాక్‌డౌన్‌పై కొంతకాలంపాటు ప్రజలెవరూ అడ్డుచెప్పలేదు. కానీ ఇప్పుడు మాత్రం పరిస్థితి మారింది. ‘మాకు ఈ లాక్‌డౌన్ వద్దు ఏమీ వద్దు, ఉపాధి కోల్పోతున్నాం. చిన్నచిన్న వ్యాధులు వచ్చినా ఆస్పత్రికి వెళ్లలేకపోతున్నాం. దయచేసి లాక్‌డౌన్ ఎత్తేయండి’ అంటూ యువతతోపాటు ఆరోగ్య నిపుణులు గొంతెత్తుతున్నారు. సోషల్‌మీడియాలోనూ చాలా మంది ఈ తరహా పోస్టులు పెడుతున్నారు. ప్రజల నుంచి కూడా ఈ తరహా పోస్టులకు అనూహ్యంగా మద్దతు లభిస్తోంది. లాక్‌డౌన్ నిబంధనలతో ఇబ్బందులు ఎదుర్కొటున్నామని సాగుతున్న అంతర్జాతీయ ఉద్యమానికి క్రమంగా మద్దతు పెరుగుతున్నది. సైంటిస్టులు, ఆరోగ్యనిపుణులు సైతం మద్దతు తెలపడం గమనార్హం.
లాక్ డౌన్ నిబంధనలతో ఆరోగ్యం కూడా దెబ్బతింటుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. లాక్‌డౌన్‌తో ఇతర ఆరోగ్యసమస్యలు.. అంటే గుండె సబంధిత వ్యాధులు, క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారికి సకాలంలో వైద్యం అందడం లేదని.. చిన్నచిన్న వ్యాధులు వచ్చేవారు కూడా ఆస్పత్రికి వెళ్లలేక సమస్యను తీవ్రం చేసుకుంటున్నారని భవిష్యత్‌లో ఇది మరింత దారుణ పరిణామాలకు దారి తీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. బ్రిటన్ కు చెందిన నిపుణులు 'గ్రేట్ బారింగ్టన్ డిక్లరేషన్' పేరిట ఈ ప్రకటన చేశారు.
టీవీ డాక్టర్లు ఫిల్ హామండ్, రోజ్‌మరీ లియోనార్డ్ సహా బ్రిటిష్ మెడికల్ అసోసియేషన్‌లో ఉన్న చాలామంది సీనియర్ వైద్యులు హెల్త్ సెక్రటరీకి లేఖ రాశారు. ప్రస్తుతం ఈ లేఖలోని అంశాలు ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారాయి. బ్రిటన్ నిపుణులు లాక్ డౌన్ కు వ్యతిరేకంగా చేసిన ప్రతి పాదనలకు ప్రపంచ వ్యాప్తంగా మద్దతు లభిస్తున్నది. ఆ ప్రకటనలో ఏముందంటే.. లాక్‌డౌన్ నిబంధనలు బలహీనులకు శాపంగా మారాయి. లాక్‌డౌన్ నిబంధనల వల్ల దీర్ఘకాలిక సమస్యలున్నవారు పెరుగుతున్నారు. దీనివల్ల భవిష్యత్ లో మనందరికీ ముప్పు వాటిళ్లుతుంది. ఇలా తదితర సమస్యలను వారు ప్రస్తవించారు.
గ్రేట్ బారింగ్టన్ డిక్లరేషన్ ఉద్యమం ఎక్కడ మొదలైంది..
నిజానికి ఈ ఉద్యమం అమెరికాలో మొదలైంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 6 వేల మంది శాస్త్రవేత్తలు, వైద్య నిపుణులు.. 50 వేల మంది ఇతరులు సంతకాలు చేశారు. - ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో ఎపిడమాలజిస్ట్ డాక్టర్ సునేత్ర గుప్తా, నాటింగ్‌హామ్ విశ్వవిద్యాలయ సెల్ఫ్ హార్మ్ ఎక్స్‌పర్ట్ ప్రొఫెసర్ ఎలెన్ టౌన్‌సెండ్, ఎడినబరో యూనివర్సిటీ డిసీజ్ మోడలర్ డాక్టర్ పాల్ మెక్‌గీ వంటి నిపుణులు సంతకాలు పెట్టిన వారిలో ఉన్నారు. లాక్‌డౌన్ కు ప్రత్యామ్నాయంగా వారు కొన్ని సూచనలు చేస్తున్నారు. వ్యాధి తీవ్రత తక్కువగా ఉన్న చోట్ల లో పనికి అనుమతించాలని కోరుతున్నారు. పాఠశాలలు, యూనివర్సిటీలు తెరవాలని చెబుతున్నారు. అయితే వీరి ఉద్యమానికి ప్రపంచ వ్యాప్తంగా ఎటువంటి మద్దతు లభిస్తుందో వేచి చూడాలి.