Begin typing your search above and press return to search.
భారత్ లో 68లక్షలు దాటిన కరోనా కేసులు..ప్రధాని మోడీ మరో పిలుపు!
By: Tupaki Desk | 8 Oct 2020 8:32 AM GMTఇండియాలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతుంది. ప్రతిరోజూ వేల సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి . కరోనా మహమ్మారి కారణంగా అమెరికా, బ్రెజిల్ మరణాల తర్వాత ప్రపంచంలో అత్యధిక మరణాలను నమోదు చేసిన మూడవ దేశంగా ఇండియా నిలిచింది. గత 24 గంటల్లో ఇండియాలో 78,524 కొత్త కేసులు నమోదు కాగా 971 మరణాలు నమోదయ్యాయి. భారత దేశ కరోనా కేసుల సంఖ్య గురువారం 68 లక్షలను దాటింది.
దేశంలో మొత్తం కేసుల సంఖ్య 68,35,656 గా ఉంది . అందులో 9,02,425 యాక్టీవ్ కేసులు ఉండగా , 58,27,705 కేసులు కరోనా నుండి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు . కరోనా కారణంగా 1,05,526 మరణాలు సంభవించాయి. భారతదేశ కరోనా రికవరీలు మేలో 50,000 ఉండగా , అవి అక్టోబర్లో 57 లక్షలకు పైగా పెరిగాయి. ముఖ్యంగా, ప్రతి రోజు 75,000 కంటే ఎక్కువ రికవరీలు ఇండియాకు ఉపశమనాన్ని కలిగిస్తున్నాయి . మహారాష్ట్ర లో కరోనా కల్లోలం కొనసాగుతూనే ఉంది. దేశంలోనే కరోనా కేసుల్లో మొదటి స్థానంలో మహారాష్ట్ర ఉంది . ఆ తర్వాత స్థానాల్లో ఆంధ్ర ప్రదేశ్ , కర్ణాటక , తమిళనాడు, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాలు ఉన్నాయి . దే
కోకరోనాకి వ్యతిరేకంగా జరిగే యుద్ధంలో ప్రజల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడానికి ప్రధాని నరేంద్ర మోడీ ఈ రోజు ఒక ప్రచారాన్ని ప్రారంభించారు. మాస్కులు ధరించడం, సామాజిక దూరాన్ని పాటించటం మరియు చేతుల పరిశుభ్రత పాటించడం యొక్క ప్రాముఖ్యతను ఆయన నొక్కి చెప్పారు. భారతదేశం యొక్క కరోనా పోరాటంలో ప్రజలు భాగస్వామ్యం తీసుకుంటున్నారు. మా కరోనా వారియర్స్ అందుకు కావాల్సిన బలాన్ని ఇస్తున్నారు అని తెలిపారు. కరోనా విజృంభణ నేపథ్యంలో సమిష్టిగా మనం చేస్తోన్న ప్రయత్నాలు చాలా మంది ప్రాణాలను కాపాడాయని మోదీ అన్నారు. ఈ ప్రయత్నాలను కొనసాగించాలని, వైరస్ నుంచి పౌరులను కాపాడాలని ఆయన కోరారు. # Unite2FightCorona అని పీఎం మోడీ తన ట్విట్టర్ ఖాతాలో స్పష్టం చేశారు .