Begin typing your search above and press return to search.

కరోనా : కోలుకున్నా.. ప్రతి ఐదుగురిలో ఆ అనారోగ్య సమస్యలు

By:  Tupaki Desk   |   9 Oct 2020 12:30 AM GMT
కరోనా : కోలుకున్నా.. ప్రతి ఐదుగురిలో ఆ అనారోగ్య సమస్యలు
X
కసారి కరోనా బారినపడి కోలుకుంటే మరోసారి ఇక ఎటువంటి సమస్యలు ఉండవని చాలామంది భావిస్తున్నారు. ఇష్టారాజ్యంగా బయట తిరిగేస్తున్నారు. మళ్లీ సమస్యలు రావు..అన్నది నిజం కాదని తాజాగా ఒక పరిశోధన తేల్చింది. కరోనా బారినపడి కోలుకున్న వారికీ అనారోగ్య సమస్యలతో పాటు దీర్ఘకాలిక సమస్యలు కూడా ఉత్పన్నం అయ్యే అవకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రతి ఐదుగురిలో నలుగురికి..సుమారు 80 శాతం మందికి అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నట్లు చెబుతున్నారు. కోవిడ్ సోకి ట్రీట్ మెంట్ పూర్తి చేసుకున్న వాళ్ళలో అత్యధికులకు నరాలకు సంబంధించిన సమస్యలు ఎదురవుతున్నాయని అమెరికాకు చెందిన పరిశోధనా బృందం తేల్చింది. ప్రతి ఐదుగురిలో నలుగురికి సుమారు 80 శాతం మందికి వాసన కోల్పోవడం, రుచి తెలియకపోవడం, కండరాల నొప్పులు, తలనొప్పి,తీవ్ర అలసట, అయోమయం వంటి రకరకాల సమస్యలు ఎదురవుతున్నాయని ఈ రీసెర్చ్ చేపట్టిన బృంద సభ్యుల్లో ఒకరైన చికాగోలోని నార్త్ వెస్ట్రన్ మెడిసిన్ లో న్యూరో ఇన్ఫెక్షన్ డిసీజ్ విభాగం చీఫ్ ఇగోర్ కొరాల్నిక్ వ్యాఖ్యానించారు.

కరోనా సోకి ఆసుపత్రిలో చికిత్స పొందిన 509 మంది రోగులపై ఈ అధ్యయనం సాగించామని వారికి నొప్పులకు సంబంధించిన సమస్యలతో పాటు మానసిక సమస్యలు కూడా బయట పడ్డట్లు వివరించారు. స్వల్ప లక్షణాలతో కరోనాకు చికిత్స తీసుకున్నా, పూర్తిగా వైరస్ పాజిటివ్ వచ్చి కోలుకున్నా బాధితుల్లో దీర్ఘకాల సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని ఆయన తెలిపారు. ఒకసారి కరోనా వైరస్ శరీరంలోకి ప్రవేశిస్తే కొన్ని నెలల పాటు శరీరంలోనే ఉంటుందని కొరాల్నిక్ వెల్లడించారు. యుక్త వయసులో ఉన్న వారికంటే 55 -65 మధ్య వయసు ఉన్నవారికి కరోనా వస్తే వారికీ ఈ అనారోగ్య సమస్యలు మరింత ప్రభావం చూపిస్తాయని ఆయన చెప్పారు. ఈ అధ్యయనం వివరాలను "అనాల్స్ ఆఫ్ క్లినికల్ అండ్ ట్రాన్స్ లేషనల్ న్యూరాలజీ" జర్నల్ లో ప్రచురితమయ్యాయి.