Begin typing your search above and press return to search.
దేశంలో 68 లక్షలు దాటిన కరోనా కేసులు ..కొత్తగా ఎన్నంటే?
By: Tupaki Desk | 8 Oct 2020 7:30 AM GMTభారత్ లో కరోనా మహమ్మారి విలయతాండవం కొనసాగుతుంది. రోజురోజుకి నమోదు అయ్యే పాజిటివ్ కేసులు కూడా పెరుగుతూనే ఉన్నాయి. గత కొన్ని రోజుల క్రితం వరకు లక్ష కి పైగా పాజిటివ్ కేసులు నమోదు కాగా , ఇప్పుడు ఆ సంఖ్య 80 వేలకి వచ్చింది. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 78,524 కేసులు నమోదు కాగా, 971 మంది కరోనాతో మృతి చెందారు. తాజా కేసులు, మరణాలతో కలుపుకుని దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 68,35,656 కేసులు నమోదు కాగా, 1,05,526 మంది మరణించినట్టు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.
అలాగే , దేశంలో ఇంకా 9,02,425 కేసులు యాక్టివ్ గా ఉన్నాయని, 58,27,705 మంది కోలుకున్నట్టు ప్రభుత్వం తెలిపింది. గడిచిన 24 గంటల్లో మనదేశంలో 11,94,321 శాంపిల్స్ పరీక్షించారు. భారత్ లో ఇప్పటి వరకు 8 కోట్ల 34 లక్షల 65,975 మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్లు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ తెలిపింది. మనదేశంలో మహారాష్ట్రలోనే అత్యధిక కరోనా కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో ఇప్పటి వరకు 14,80,489 మందికి కరోనా సోకగా.. 39,072 మంది మరణించారు. ఇక రెండో స్థానంలో ఏపీ ఉంది. ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటి వరకు 7,34,427 కేసులు నమోదవగా.. 6,086 మంది చనిపోయారు. ఆ తర్వాతి స్థానాల్లో తమిళనాడు, కర్నాటక, యూపీ రాష్ట్రాలున్నాయి. ఇక , నేడు తెలంగాణ లో 1,896 కేసులు బయటపడ్డాయి. వీటితో కలుపుకుని ఇప్పటి వరకు మొత్తం 2,06,644 కేసులు నమోదు అయ్యాయి.