Begin typing your search above and press return to search.
కరోనా లేటెస్ట్ అప్డేట్ : 24 గంటల్లో 72,049 పాజిటివ్ కేసులు!
By: Tupaki Desk | 7 Oct 2020 6:45 AM GMTదేశంలో కరోనా వైరస్ కేసులకు అడ్డుకట్ట పడడం లేదు. ప్రతి రోజు వేల సంఖ్యలో కేసులు వెలుగుచూస్తూనే ఉన్నాయి. అయితే దేశంలో కరోనా వైరస్ బలహీనపడింది. కానీ దాని వ్యాప్తి తగ్గలేదు. చాలా మందికి వైరస్ సోకి, పోతోంది కూడా. ఈ విషయం వారికే తెలియట్లేదు. కొంతమందికి వైరస్ ఉన్నా లక్షణాలు లేవు. అందువల్ల ఇండియాలో కరోనా పట్ల ప్రజల్లో భయాందోళనలు చాలా వరకూ తగ్గాయి. కానీ , జాగ్రత్త గా ఉండకపోతే భారీ మూల్యం చెల్లించుకుంటారు. తాజాగా గత 24 గంటల్లో భారత్ లో మరో 72,049 పాజిటివ్ కేసులు వచ్చాయి. మొత్తం కేసుల సంఖ్య 67,57,131కి చేరింది. నిన్న కొత్తగా 986 మంది కరోనాతో చనిపోయారు. మొత్తం మరణాల సంఖ్య 1,04,555కి చేరింది. ఇండియాలో మరణాల రేటు 1.5 శాతంగా ఉంది. ప్రపంచ దశాల్లో అది 2.9 శాతంగా ఉంది. భారత్ లో నిన్న 82,203 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మొత్తం రికవరీల సంఖ్య 57,44,693కి చేరింది. అలాగే... యాక్టివ్ కేసులు 9,07,883కి చేరాయి. ఇండియాలో టెస్టులు నిన్న 11,99,857 జరిగాయి. మొన్నటి కంటే 1,10,454 ఎక్కువ జరిగాయి. మొత్తం టెస్టుల సంఖ్య 8కోట్ల 22లక్షల 71వేల 654కి చేరింది. ప్రస్తుతం మొత్తం కేసుల్లో అమెరికా తర్వాత ఇండియా టాప్ 2లో కొనసాగుతోంది. రోజువారీ నమోదవుతున్న కరోనా కేసుల్లో ఇండియా మొదటి స్థానంలో కొనసాగుతోంది. అలాగే... మొత్తం మరణాల్లో అమెరికా, బ్రెజిల్ తర్వాత భారత్... మూడో స్థానంలో ఉంది. రోజువారీ నమోదవుతున్న కరోనా మరణాల్లో ఇండియా మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాత బ్రెజిల్, అమెరికా ఉన్నాయి.
ఇక , తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. గత 24 గంటల్లో కొత్తగా 2,154 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 2,04,748కి పెరిగింది. అలాగే, నిన్న ఒక్క రోజే కరోనా మహమ్మారి కారణంగా 8 మంది మృతి చెందారు. వీరితో కలుపుకుని రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 1,189 మంది మరణించారు. గత 24 గంటల్లో 2,239 మంది కోలుకోవడంతో ఈ సంఖ్య 1,77,008కి పెరిగింది. రాష్ట్రంలో ఇంకా 26,551 కేసులు యాక్టివ్‌గా ఉండగా, వీరిలో 21,864 మంది హోం ఐసోలేషన్‌లో ఉండి చికిత్స పొందుతున్నట్టు వైద్య ఆరోగ్యశాఖ ఈ ఉదయం విడుదల చేసిన బులెటిన్‌లో పేర్కొంది. నిన్న ఒక్క రోజే రాష్ట్రవ్యాప్తంగా 54,277 కరోనా పరీక్షలు నిర్వహించడంతో ఇప్పటి వరకు నిర్వహించిన పరీక్షల సంఖ్య 33,46,472కు పెరిగింది.
ఏపీలో సాధారణ పరిస్థితుల దిశగా పురోగతి కనిపిస్తోంది. రాష్ట్రంలో కరోనా మహమ్మారి వ్యాప్తి క్రమంగా నెమ్మదిస్తోంది. గడచిన 24 గంటల్లో రాష్ట్రంలో 33 మంది కరోనాతో మృతి చెందగా, 5,795 పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 970, అత్యల్పంగా కర్నూలు జిల్లాలో 123 కేసులు గుర్తించారు. అదే సమయంలో రాష్ట్రవ్యాప్తంగా 6,046 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మొత్తంగా చూస్తే, ఇప్పటివరకు ఏపీలో మొత్తం 7,29,307 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 6,72,479 మంది కరోనా నుంచి కోలుకున్నారు.