Begin typing your search above and press return to search.

భారత్‌ లో కరోనా తీవ్రరూపం.. 24 గంటల్లో 61,267 కరోనా కేసులు

By:  Tupaki Desk   |   6 Oct 2020 7:30 AM GMT
భారత్‌ లో కరోనా తీవ్రరూపం.. 24 గంటల్లో  61,267  కరోనా కేసులు
X
భారత్‌ లో కరోనా వైరస్‌ కేసుల విజృంభణ కొనసాగుతోంది. తాజాగా దేశంలో గడిచిన 24 గంటల్లో 61,267 మందికి కరోనా నిర్ధారణ అయిందని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. తాజాగా వచ్చిన కేసులతో కలిపి ఇప్పటివరకు దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 66,85,083 కి చేరింది. అలాగే , గ‌త 24 గంట‌ల సమయంలో 903 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,03,569 కి పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 56,62,491 మంది కోలుకున్నారు. 9,19,023 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌ లలో చికిత్స అందుతోంది.

ఇక , తెలంగాణలో కరోనా పాజిటివ్‌ కేసులు మళ్లీ భారీగా పెరిగాయి... టెస్ట్‌ల సంఖ్య తగ్గడంతో నిన్న 1,335 కేసులే నమోదు కాగా, నేడు మళ్లీ రెండువేలకు చేరువయ్యాయి. తాజా కరోనా బులెటిన్‌ ప్రకారం గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 1,983 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇదే సమయంలో 2,381 మంది డిశ్చార్జ్ కాగా 10 మంది మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 2,02,594కు చేరగా ఇప్పటి వరకు 1,74,769 మంది రికవరీ అయ్యారు. 1,181 మంది మృతిచెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 26,644 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మరోవైపు సోమవారం రోజు రాష్ట్రవ్యాప్తంగా 50,598 కరోనా నిర్ధారణ పరీక్షలు చేసినట్టు ప్రభుత్వం పేర్కొంది.

ఇక ఏపీలో కొత్తగా నమోదవుతున్న కరోనా కేసుల సంఖ్య భారీగా తగ్గుతోంది. నిన్న 4,256 కొత్త కేసులు మాత్రమే నమోదయ్యాయి. తాజా కేసులతో రాష్ట్రంలోని మొత్తం కేసుల సంఖ్య 7,23,512కి చేరుకున్నాయి. ఇదే సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా 38 మంది మృతి చెందారు. దీంతో, మొత్తం మరణాల సంఖ్య 6,019కి చేరుకుంది.