Begin typing your search above and press return to search.

భారత్ కరోనా అప్డేట్ : 24 గంటల్లో 74,442 కేసులు

By:  Tupaki Desk   |   5 Oct 2020 5:45 AM GMT
భారత్ కరోనా అప్డేట్ : 24 గంటల్లో 74,442 కేసులు
X
ఇండియాలో కరోనా మహమ్మారి కేసులు ఇప్పట్లో తగ్గేలా కన్పించడంలేదు. గత పదిరోజులుగా రోజువారీ పాజిటివ్ కేసులు తగ్గినట్లే తగ్గి మళ్లీ పెరుగుతున్నాయి. గత రెండు రోజులుగా తగ్గుతూ వస్తున్న కరోనా కేసులు మళ్లి పెరిగాయి. తాజాగా భారత్‌ లో గత 24 గంటల్లో 74,442 మందికి కరోనా నిర్ధారణ అయిందని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దీంతో దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 66,23,816 కి చేరింది.

గ‌త 24 గంట‌ల సమయంలో 903 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,02,685 కి పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 55,86,704 మంది కోలుకున్నారు. 9,34,427 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌ లలో చికిత్స అందుతోంది. దేశంలో మొత్తం నమోదయిన కేసులలో 1.55 శాతానికి తగ్గిన మరణాల రేటు, దేశంలో నమోదయిన మొత్తం కేసులలో యాక్టివ్ కేసుల శాతం 14.11 శాతంగా ఉంది.

తెలంగాణ కరోనా కేసులు 2 లక్షలు దాటేశాయి. రాష్ట్రంలో నిన్న రాత్రి 8 గంటల వరకు 1,335 కొత్త పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 2,00,611కి చేరింది. ఈమేరకు వైద్య ఆరోగ్యశాఖ సోమవారం ఉదయం బులిటెన్‌ విడుదల చేసింది. నిన్న ఒక్కరోజే కరోనాతో 8 మంది మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,171కి చేరింది. కరోనా బారి నుంచి నిన్న ఒక్క రోజే 2,176 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కోలుకున్న బాధితుల సంఖ్య 1,72,388కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 27,052 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని, వారిలో 22,134 మంది హోం ఐసోలేషన్‌ లో చికిత్స పొందుతున్నారని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. మరోవైపు జీహెచ్ ‌ఎంసీ పరిధిలో 262 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది.

ఇక ఏపీలో గడచిన 24 గంటల్లో ఏపీలో 40 మరణాలు, 6,242 కొత్త పాజిటివ్ కేసులు వచ్చాయి. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 863 కేసులు గుర్తించారు. అత్యల్పంగా శ్రీకాకుళం జిల్లాలో 192 కేసులు వెల్లడయ్యాయి. తాజాగా 7,084 మందికి కరోనా నయమైంది. ఓవరాల్ గణాంకాలు చూస్తే మొత్తం కరోనా కేసుల సంఖ్య 7,19,256కి పెరిగింది. ఇప్పటివరకు 6,58,875 మంది కరోనా నుంచి కోలుకోగా, ఇంకా 54,400 మంది చికిత్స పొందుతున్నారు. అటు మొత్తం మరణాల సంఖ్య 5,981కి పెరిగింది.