Begin typing your search above and press return to search.
లేటెస్ట్ అప్డేట్ : భారత్ లో లక్ష దాటిన కరోనా మృతులు
By: Tupaki Desk | 3 Oct 2020 6:30 AM GMTభారత్ లో కరోనా మహమ్మారి పాజిటివ్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. తాజాగా గత 24 గంటల్లో కొత్తగా 79476 మందికి కరోనా సోకింది. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 64,73,544కి చేరింది. అలాగే మరో 1069 మంది చనిపోయారు. గత నెల రోజులుగా ప్రతిరోజూ వెయ్యికి పైగా కరోనా బాధితులు మరణిస్తున్నారు. నిన్న ఉదయం నుంచి ఈరోజు ఉదయం వరకు కొత్తగా 1069 మంది మృతిచెందారు. దీంతో దేశంలో ఇప్పటివరకు కరోనా వల్ల లక్షా 842 మంది చనిపోయారు. దేశంలో మరణాల రేటు 1.6 శాతంగా ఉంది. ప్రపంచ దేశాల్లో అది కాస్త తగ్గి.. 2.97 శాతంగా ఉంది.
ఇండియాలో నిన్న 75,628 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మొత్తం కరోనా రికవరీల సంఖ్య 54,27,706కి చేరింది. దేశంలో రికవరీ రేటు మరింత పెరిగి 83.8 శాతానికి చేరింది. దేశంలో యాక్టివ్ కేసులు ఇప్పుడు 9,44,996 ఉన్నాయి. ఇండియాలో నిన్న 11,32,675 టెస్టులు చేశారు. మొత్తం టెస్టుల సంఖ్య 7,78,50,403కి పెరిగింది. ప్రస్తుతం మొత్తం కేసుల్లో అమెరికా తర్వాత ఇండియా టాప్ 2లో కొనసాగుతోంది. రోజువారీ నమోదవుతున్న కరోనా కేసుల్లో ఇండియా మొదటి స్థానంలో కొనసాగుతోంది. అలాగే... మొత్తం మరణాల్లో అమెరికా, బ్రెజిల్ తర్వాత భారత్... మూడో స్థానంలో ఉంది. రోజువారీ నమోదవుతున్న కరోనా మరణాల్లో ఇండియా మొదటి స్థానంలో ఉంది.