Begin typing your search above and press return to search.
కరోనా అప్డేట్ : దేశంలో 24 గంటల్లో దేశంలో 81,484 కేసులు!
By: Tupaki Desk | 2 Oct 2020 6:45 AM GMTభారత్ లో కరోనా వైరస్ ఉద్ధృతి కాస్త తగ్గుతోంది. ఓ దశలో ప్రతి రోజు లక్ష కొత్త కేసులు నమోదయ్యేవి. కానీ ప్రస్తుతం ఆ సంఖ్య 82వేలకు తగ్గింది. కొత్త కేసులు తగ్గడంతో పాటు రికవరీల సంఖ్య పెరుగుతోంది. ఐతే మరణాలు మాత్రం వెయ్యికి పైగానే నమోదవుతున్నాయి.
గత 24 గంటల్లో దేశంలో 81,484 మందికి కరోనా నిర్ధారణ అయిందని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. దీంతో దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 63,94,069కి చేరింది.
గత 24 గంటల సమయంలో 1,095 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 99,773 కి పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 53,52,078 మంది కోలుకున్నారు. 9,42,217 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్ లలో చికిత్స అందుతోంది. టెస్ట్‌ల విషయానికొస్తే.. గడిచిన 24 గంటల్లో మనదేశంలో 10,97,947 శాంపిల్స్ పరీక్షించారు. భారత్ లో ఇప్పటి వరకు 7 కోట్ల 67 లక్షల 17,728 మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్లు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ తెలిపింది.
మనదేశంలో మహారాష్ట్రలోనే అత్యధిక కరోనా కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో ఇప్పటి వరకు 14,00,922 మందికి కరోనా సోకగా.. 37,056 మంది మరణించారు. ఇక రెండో స్థానంలో ఏపీ ఉంది. ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటి వరకు 7,00,235 కేసులు నమోదవగా.. 5,869 మంది చనిపోయారు. ఆ తర్వాతి స్థానాల్లో తమిళనాడు, కర్నాటక, యూపీ రాష్ట్రాలున్నాయి.