Begin typing your search above and press return to search.
కరోనా అప్డేట్ : 24 గంటల్లో 80,472 పాజిటివ్ కేసులు
By: Tupaki Desk | 30 Sep 2020 5:30 AM GMTభారత్ లో కరోనా ఉగ్రరూపం దాలుస్తోంది. భారత్ లో కరోనా మహమ్మారి వ్యాప్తి రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. వివిధ రాష్ట్రాల నుండి కొత్త కేసులు పెరుగుతూనే ఉన్నాయి. దేశంలో కేసుల సంఖ్య 62 లక్షల 25 వేలు దాటింది. గత 24 గంటల్లో దేశంలో 80,472 మందికి కరోనా నిర్ధారణ అయిందని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. దీంతో దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 62,25,764 కి చేరింది.
గత 24 గంటల సమయంలో 1,179 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 97,497 కి పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 51,87,826 మంది కోలుకున్నారు. 9,40,441 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్లలో చికిత్స అందుతోంది. కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 7,41,96,729 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి తెలిపింది. నిన్న ఒక్కరోజులోనే 10,86,688 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది. ప్రస్తుతం దేశంలో కరోనా బాధితుల రికవరీ రేటు 83.33 శాతంగా ఉంది. దేశంలో మొత్తం నమోదయిన కేసులలో 1.57 శాతానికి తగ్గిన మరణాల రేటు, దేశంలో నమోదయిన మొత్తం కేసులలో యాక్టివ్ కేసుల శాతం 15.11 శాతంగా ఉంది.