Begin typing your search above and press return to search.
లేటెస్ట్ కరోనా అప్డేట్ : దేశంలో ఒక్కరోజులో ఎన్నంటే ?
By: Tupaki Desk | 25 Sep 2020 7:50 AM GMTకరోనా మహమ్మారి వెలుగులోకి వచ్చి నెలలు గడుస్తున్నా కూడా దీన్ని అరికట్టే సరైన వ్యాక్సిన్ ను ప్రపంచం తీసుకు రాలేక పోతుంది. వ్యాక్సిన్ కోసం ఇంకా ప్రయోగాలు జరుగుతున్నాయి. దీనితో ప్రపంచంలో రోజురోజుకి కరోనా వ్యాప్తి పెరిగిపోతుంది. ముఖ్యంగా భారత్ లో కరోనా జోరు కి వ్యాక్సిన్ వచ్చే తప్ప బ్రేకులు పడేలా లేవు. ఓ దశలో ప్రతి రోజు లక్ష కొత్త కేసులు నమోదయ్యేవి. కానీ ప్రస్తుతం ఆ సంఖ్య 86వేలకు తగ్గింది. కొత్త కేసులు తగ్గడం తో పాటు రికవరీల సంఖ్య పెరుగుతోంది. తాజాగా దేశం లో కరోనా కేసుల సంఖ్య 58 లక్షలు దాటింది. గత 24 గంటల్లో దేశంలో 86,052 మందికి కరోనా నిర్ధారణ అయిందని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది.
దీనితో దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 58,18,571కి చేరింది. గత 24 గంటల సమయంలో 1,141 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీనితో దేశ వ్యాప్తంగా కరోనా మృతుల సంఖ్య మొత్తం 92,290కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 47,56,165 మంది కోలుకున్నారు. 9,70,116 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్ లలో చికిత్స అందుతోంది. కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 6,89,28,440 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి తెలిపింది. నిన్న ఒక్కరోజులోనే 14,92,409 శాంపిళ్లను పరీక్షించినట్లు వెల్లడించింది.
మనదేశంలో మహారాష్ట్రలోనే అత్యధిక కరోనా కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో ఇప్పటి వరకు 12,82,963 మందికి కరోనా సోకగా.. 34,345 మంది మరణించారు. ఇక రెండో స్థానంలో ఏపీ ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకు 6,54,385 కేసులు నమోదవగా.. 5,558 మంది చనిపోయారు.