Begin typing your search above and press return to search.
ప్రైవేట్ లో పాజిటివ్... గవర్నమెంట్ లో నెగటివ్ ... తప్పుడు రిపోర్టులతో మోసం చేస్తున్న ల్యాబ్ !
By: Tupaki Desk | 25 Sep 2020 2:30 AM GMTకరోనా ఓవైపు కోరలు చాచుకొని కూర్చొని ఉంటే , కుదిరితే సహాయం చేయాల్సింది పోయి , కాసుల కోసం కక్కుర్తి పడి రిపోర్ట్స్ కూడా మార్చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్ లో ప్రైవేట్ ల్యాబ్ భాగోతం బయటపడింది. కాసులకు కక్కుర్తి తో జనం జీవితాలతో ఆటలాడుతున్నారు. తాజాగా ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ లోగల ఒక పాథాలజీ ల్యాబ్ కరోనా నెగిటివ్ ఉన్నవారిని కరోనా పాజిటివ్ గా చూపించిన ఘటన కలకలం రేపింది. ఈ ల్యాబ్‌లో పరీక్షలు చేయించుకున్న 30 మందికి కరోనా పాజిటివ్ రిపోర్టు వచ్చింది. అయితే, వీరంతా తిరిగి ప్రభుత్వ ఆసుపత్రిలో టెస్టులు చేయించుకోగా నెగిటివ్ రిపోర్టు వచ్చింది.
ఈ ఘటన పై అధికారులు దర్యాప్తునకు ఆదేశాలు జారీ చేశారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే .. స్వరూప్ నగర్ కు చెందిన ఓ బాధితుడు కరోనా లక్షణాలు కనిపించడంతో సమీపంలోని పాథాలజీ ల్యాబ్‌కు వెళ్లి పరీక్ష చేయించుకున్నాడు. దీనితో అతనికి కరోనా పాజిటివ్ గా నిర్ధారించారు. అయితే, అనుమానం వచ్చిన బాధితుడు సమీపంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో కరోనా పరీక్షలు నిర్వహించగా, నెగెటివ్ గా తేలింది. దీంతో ఆ బాధితుడు జిల్లా వైద్యాధికారులకు ఫిర్యాదు చేశాడు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ల్యాబ్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాడు. దీంతో పాథాలజీ ల్యాబ్ పై జిల్లా వైద్యాధికారి అలోక్ తివారి, సీఎంఓ డాక్టర్ అనిల్ కుమార్ మిశ్రాలు దాడి చేశారు. దీనికితోడు ఆ ల్యాబ్‌లో మరిన్ని అవకతవకలు జరగుతున్నాయని అధికారులు గుర్తించారు. ఈ నేపధ్యంలో ఈ ల్యాబ్ లో కరోనా పరీక్షలు చేయించుకుని, పాజిటివ్ వచ్చిన కొంతమందికి తిరిగి ప్రభుత్వ ఆసుపత్రిలో పరీక్షలు చేయించగా వారికి నెగిటివ్ రిపోర్టు వచ్చింది. ల్యాబ్ లో జరిగిన అవకతవకలపై వెంటనే దర్యాప్తు చేయాలని జిల్లా వైద్యాధికారి అధికారులను ఆదేశించారు.