Begin typing your search above and press return to search.
భారత్ లో కరోనా తగ్గుతోందా.. పెరుగుతోందా! నిజానిజాలేంటి?
By: Tupaki Desk | 23 Sep 2020 11:30 PM GMTప్రపంచ దేశాలతో పాటు మనదేశాన్ని కరోనా మహమ్మారి అతలాకుతలం చేసింది. లాక్డౌన్ సమయంలో కొంచెం తక్కువగా ఉన్న కేసులు.. లాక్డౌన్ ఎత్తేశాక కట్టలు తెంచుకున్నాయి. కేసుల పెరుగుదలకే అంతే లేకుండా పోయింది. రోజుకు 60 వేలు, 70 వేలు, 90 వేలు లక్షదాక కేసులు పెరిగాయి. ఈ క్రమంలో పెరుగుట విరుగట కొరకే అని కొందరు విశ్లేషకులు భావించారు. భారత్ లో కేసులు భారీగా పెరిగి ఆ తర్వాత తగ్గు ముఖం పడతాయని చెప్పారు. కానీ ఇక్కడ కేసుల సంఖ్య పెరగడమే తప్ప తగ్గడం కనిపించలేదు. ఈ నేపథ్యంలో కేసులు పెరుగుతున్నప్పటికీ రికవరీ కూడా అదే స్థాయిలో ఉండటంతో జనంలో కొంతమేర భయం పోయింది. తమ కండ్ల ముందే చాలా మంది కి కరోనా వచ్చి తగ్గక పోతుండటంతో జనం ఈ మహమ్మారి ని లైట్ తీసుకొనే పరిస్థితి కి వచ్చారు. ఓ దశలో కరోనా ఏముంది? అందరికీ వస్తుంది? పోతుంది కాస్త జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది అనే ఆలోచనలో పడ్డారు. వృద్ధులు, చిన్నపిల్లలు జాగ్రత్తగా ఉంటూ.. మిగతా వాళ్లు యథావిధిగా తమ పనులు చేసుకుంటున్నారు. జులై-ఆగస్టు నెలల్లోనే కరోనా తీవ్రత పతాక స్థాయికి చేరుతుందని.. ఆ తర్వాత తగ్గుముఖం పడుతుందని ఒక దశలో అంచనా వేశారు. కానీ అలా జరగలేదు. కేసుల సంఖ్య పెరిగింది తప్ప తగలేదు.
ఈ వారం లెక్క మారింది..
అయితే గతవారం రోజులుగా మనం కరోనా కేసులను అంచనా వేస్తే గతంకంటే కొంత తగ్గినట్టుగా అనిపిస్తున్నది. ఈ వారంలో కేసులు రోజుకు 75 వేలు మాత్రమే నమోదవుతున్నాయి. రోజుకు 90 వేల నుంచి 75 వేలకు పడిపోయాయని.. ఇదే పరిస్థితి కొనసాగితే దేశంలో కేసుల సంఖ్య తగ్గడం మొదలైందని భావించవచ్చని కొందరు నిపుణులు అంచనా వేస్తున్నారు. ఓ సారి ఇలా తగ్గడం స్టార్ట్ అయ్యిందంటే ఇక కేసుల సంఖ్య క్రమేపీ తగ్గతుంది. ఈ విషయాన్ని ప్రపంచవ్యాప్తంగా గణాంకాలు చెబుతున్నాయి. బ్రెజిల్, ఇటలీ, అమెరికా లాంటి ఎక్కువ కేసులున్న దేశాల్లో ఇదే పరిస్థితి కనిపించింది. వ్యాక్సిన్ వచ్చిందంటే కరోనా ముప్పు తగ్గినట్టే.. అయితే ఆ లోపే కేసుల సంఖ్య కూడా తగ్గితే మనకు కొంతమేర ఉపశమనం లభించినట్టే.