Begin typing your search above and press return to search.
ప్రపంచమంతా రెచ్చిపోతోంది ఆ రకమే.. తేల్చిన సీసీఎం
By: Tupaki Desk | 21 Sep 2020 4:00 AM GMTప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ కు చెక్ చెప్పేందుకు పెద్ద ఎత్తున వ్యాక్సిన్ ప్రయోగాలు సాగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికి ఒక కొలిక్కి రాని వేళ.. ఈ వైరస్ లెక్క తేల్చేందుకు పలు ప్రయోగ సంస్థలు ఎవరికి వారు ఎప్పటికప్పుడు అధ్యయనాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా హైదరాబాద్ కు చెందిన సీసీఎంబీ సంస్థ కోవిడ్ వైరస్ ఎన్ని రకాలు ఉన్నాయి? వాటిల్లో ఎక్కువగా చెలరేగి పోతున్న రకమేదీ? అన్న విషయాల్ని గుర్తించేందుకు ప్రత్యేకంగా ప్రయోగాలు చేస్తోంది.
ఇందులో భాగంగా ఆ సంస్థ కు చెందిన శాస్త్రవేత్త లు దాదాపు 2వేల వైరస్ జన్యుక్రమాలను పరిశీలించారు. వారు చేసిన ప్రయోగాలకు సంబంధించి ఆసక్తికర అంశాల్ని వెల్లడించారు సీసీఎంబీ డైరెక్టర్ రాకేశ్ మిశ్రా. దేశం లో ఎక్కువ గా మనుగడలో ఉన్న రెండు రకాల వైరస్ రకాల్ని గుర్తించారు. దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో ఏ2ఏ రకం కనిపించగా.. దక్షిణాదిన క్లేడ్ ఏ3ఐ రకం ఎక్కువగా మనుగడలో ఉన్నట్లుగా తేల్చారు.
ఈ రెండింటిలో ఏ3ఐ రకం క్రమంగా బలహీనమవుతున్న వైనాన్ని గుర్తించారు. అదే సమయంలో ఏ2ఏ రకం మాత్రం వ్యాప్తి చెందుతున్న విషయాన్ని గుర్తించారు. ప్రపంచ వ్యాప్తంగా ఇదే రకం విస్తరిస్తున్నట్లుగా తాము గుర్తించినట్లు చెప్పారు. ప్రస్తుతం మన దేశంలో 70 శాతం వరకు ఏ2ఏ రకమే మనుగడలో ఉందని.. ఈ కారణంగా ఒకే వ్యాక్సిన్ అందరికి సరిపోతుందని తేల్చారు. ఎంతకూ కొరుకుడుపడకుండా చుక్కలు చూపిస్తున్న మహమ్మారికి చెక్ పెట్టేందుకు ఇదో సానుకూలాంశంగా ఆయన చెబుతున్నారు. దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఒకే రకం రెచ్చిపోతున్న వేళ.. దాని పీచమణిచే దిశగా జరుగుతున్న ప్రయోగాలు త్వరలోనే ఫలితాలు రావటానికి సాయం చేసే అవకాశం ఉందని చెప్పక తప్పదు.