Begin typing your search above and press return to search.
ఇండియాలో కరోనా బీభత్సం .. కొత్తగా ఎన్నంటే!
By: Tupaki Desk | 18 Sep 2020 5:00 AM GMTఇండియాలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తుంది. తాజాగా గడిచిన 24 గంటల్లో దేశంలో రికార్డు స్థాయిలో కొత్త కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజే 96,424 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అలాగే , అదే సమయంలో మరో 1,174 మంది మరణించారు. నిన్న 87,472 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తాజా కేసులతో కలిపి భారత్ లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 52,14,677కి చేరింది. కరోనాను జయించి 41,15,551 మంది పూర్తిగా కోలుకున్నారు. వైరస్ తో పోరాడుతూ 84,372 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం 10,17,754 కరోనా యాక్టివ్ కేసులున్నాయి.
ఇక, దేశంలో కరోనా టెస్టుల విషయానికొస్తే .. గడిచిన 24 గంటల్లో మనదేశంలో 10,06,615 శాంపిల్స్ పరీక్షించారు. భారత్‌లో ఇప్పటి వరకు 6 కోట్ల 15 లక్షల 72,343 మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్లు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ తెలిపింది. మనదేశంలో మహారాష్ట్రలోనే అత్యధిక కరోనా కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో ఇప్పటి వరకు 11,45,840మందికి కరోనా సోకగా.. 31,351 మంది మరణించారు. ఇక రెండో స్థానంలో ఏపీ ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకు 6,01,462 కేసులు నమోదవగా.. 5,177 మంది చనిపోయారు. ఆ తర్వాతి స్థానాల్లో తమిళనాడు, కర్నాటక, యూపీ ఉన్నాయి.