Begin typing your search above and press return to search.
కరోనా ఖతం చేసే అణువొచ్చింది!
By: Tupaki Desk | 17 Sep 2020 4:45 AM GMTచైనాలో పుట్టిన కరోనా మహమ్మారి ప్రపంచదేశాలను అతలా కుతలం చేసింది. అన్ని దేశాలు ఆర్థికంగా పతనమయ్యాయి. మందులేని ఈ మాయదారి రోగం జనాలను సర్వనాశనం చేసింది. ఓ వైపు కరోనా వచ్చిన నిరు పేదలు ఆస్పత్రి బిల్లులు కట్టలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరో వైపు కరోనా దెబ్బ కు ఉపాధి కోల్పోయి ఇంకొందరు పేదలు ఆకలి తో అలమటిస్తున్నారు. మొత్తం మీద ఈ రోగం ప్రపంచాన్ని వణికించింది. అయితే కరోనా మహమ్మారి అంతమొందించే వ్యాక్సిన్‌ను కనిపెట్టేందుకు ప్రపంచ వ్యాప్తంగా శాస్త్రవేత్తలు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇప్పటికే చాలా దేశాలు తీసుకొచ్చిన వ్యాక్సిన్లు మొదటి, రెండో ట్రయల్‌ను పూర్తిచేసుకొని.. మూడోదశ ట్రయల్స్ నిర్వహిస్తున్నాయి. అయితే తాజాగా శాస్త్ర వేత్తలు అమెరికా కు చెందిన శాస్త్రవేత్తలు ఓ అణువును కనిపెట్టారు.
ఈ అణువు కరోనా వైరస్‌ను అంతమొందిస్తుందని వారు చెబుతున్నారు. ఈ అణువు సాయంతో కరోనాకు తేలికగా మందు కనిపెట్టవచ్చని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. అయితే ఈ ఏడాది చివరినాటికి.. లేదా వచ్చే ఏడాది ప్రారంభంలో దీనిపై క్లినికల్ ట్రయల్స్ నిర్వహించనున్నారు. ఈ అణువును కనిపెట్టింది అమెరికాకు చెందిన ప్రఖ్యాత పిట్స్బర్గ్ యూనివర్సిటీ పరిశోధకులు. ఈ అణువు.. కరోనా వైరస్ ను న్యూట్రిలైజ్.. తెలుగు లో చెప్పాలంటే తటస్థం చేస్తుందని సదరు పరిశోధకులు తేల్చారు. అంతేకాక ఈ అణువు శరీరం లోని వెళ్లిన వెంటనే భారీ స్థాయిలో యాంటీబాడీస్ ను ఉత్పత్తి చేసి కరోనా మహమ్మారిని అంతమొందిస్తుందని చెప్పారు.
కాగా ఇప్పటికే జంతువులపై చేసిన ప్రయోగాలు సక్సెస్ కావడం తో మనుషులపై ప్రయోగాలు చేస్తున్నారు. అయితే ఈ అణువుపై మరింత విస్తృత స్థాయిలో ప్రయోగాలు జరుగవలసి ఉందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఈ అణువు తో కరోనా ను అంతమొందించే డ్రగ్ ను చాలా తేలికగా రూపొందించవచ్చని చెప్పారు. కాగా ఈ అణువుపై ట్రయల్స్ నిర్వహించేందుకు అనుమతి కోసం శాస్త్రవేత్తలు ఎఫ్‌డీఏకు దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఇంకా అనుమతి రాలేదు. అనుమతి వచ్చిన వెంటనే ట్రయల్స్ సాగునున్నాయి. ఈ మందు ధర కూడా చాలా తక్కువగా ఉంటుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. నాసల్ స్ప్రే రూపంలో దీన్ని అందుబాటులో తీసుకొస్తామని సైంటిస్టులు చెబుతున్నారు.