Begin typing your search above and press return to search.
దేశంలో 50 లక్షలు దాటిన కరోనా కేసులు !
By: Tupaki Desk | 16 Sep 2020 4:45 AM GMTభారతదేశంలో కరోనా విలయతాండవం కొనసాగుతోంది. ప్రతిరోజూ కూడా కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. రోజురోజుకి ఇతర దేశాల్లో కరోనా కేసులు తగ్గుముఖం పడుతుంటే , ఇండియాలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఇక ఇప్పటికే దేశం లో కరోనా కేసులు 50 లక్షలు దాటిపోయాయి. తాజగా లెక్కల ప్రకారం గడిచిన 24 గంటల్లో ఇండియాలో కొత్తగా 90,123 కేసులు నమోదయ్యాయి. దీనితో భారత్ లో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 50,20,360కి చేరింది.
వీటిల్లో ప్రస్తుతం, 9,95,933 కేసులు యాక్టివ్ గా ఉండగా, 39,42,361 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఇక, ఇదిలా ఉంటే గడిచిన 24 గంటల్లో ఇండియాలో రికార్డ్ స్థాయిలో మరణాలు సంభవించాయి. 24 గంటల్లో ఇండియాలో 1290 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో ఇండియాలో కరోనాతో మరణించిన వారి సంఖ్య 82,066కి చేరింది. ఇండియాలో వచ్చే ఏడాది మార్చి వరకు వాక్సిన్ అందుబాటులోకి వస్తుందని కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించిన సంగతి తెలిసిందే. అప్పటి వరకు కరోనాతో సహజీవనం చేయక తప్పనిసరి.
కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 5,94,29,115 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి తెలిపింది. నిన్న ఒక్కరోజులోనే 11,16,842 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.