Begin typing your search above and press return to search.

ఇక్కడ నెగటివ్ ..అక్కడ పాజిటివ్ !

By:  Tupaki Desk   |   15 Sep 2020 7:10 AM GMT
ఇక్కడ నెగటివ్ ..అక్కడ పాజిటివ్ !
X
కరోనా మహమ్మారి దేశంలో రోజురోజుకి మరింతగా విజృంభిస్తూ , ఊహించని విధంగా వ్యాప్తి చెందుతుంది. ప్రతిరోజూ కూడా దాదాపుగా లక్ష వరకు పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. అలాగే, ప్రతి రోజు కూడా వెయ్యి కి పైగా కరోనా మరణాలు సంభవిస్తున్నాయి. ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా కూడా కరోనా దేశంలో కంట్రోల్ అవ్వడంలేదు. ఇక దేశ వ్యాప్తంగా ప్రతి రోజూ కూడా భారీగా టెస్టులు చేస్తున్నారు. ఇకపోతే , ప్రస్తుతం కరోనా నిబంధనలకు లోబడి పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి.

దీనితో పార్లమెంట్ హాల్ లోకి వెళ్లాలి అంటే కరోనా టెస్ట్ తప్పనిసరి చేశారు. కరోనా నెగటివ్ అన్న పత్రం ఖచ్చితంగా చూపించాల్సిందే అని ఆదేశాలు జారీచేశారు. అలాగే పార్లమెంట్ హాల్ పరిధిలో కరోనా టెస్టులు కూడా నిర్వహిస్తున్నారు. ఈ టెస్టుల్లో ఇప్పటి వరకు దాదాపుగా 30 మంది ఎంపీలకు కరోనా పాజిటివ్ అని తేలింది. అయితే , కొంతమంది ఎంపీలు ఢిల్లీకి వెళ్లే ముందు తమ నియోజకవర్గం లో కరోనా పరీక్షలు చేయించుకోగా ..నెగటివ్ వచ్చి , వారు ఢిల్లీ లో కరోనా టెస్ట్ చేయించుకున్న సమయంలో పాజిటివ్ గా తేలుతుంది. విశాఖ జిల్లా అరకు ఎంపీ గొట్టేటి మాధవికి నియోజక వర్గంలో టెస్ట్ చేయించుకున్న సమయంలో నెగటివ్ అని ..ఢిల్లీ పార్లమెంట్ హాల్ లో పాజిటివ్ అని రిపోర్ట్ వచ్చింది. దీనితో ఎంపీల్లో గందరగోళం నెలకొన్నది.

ఇక, భారత్‌ లో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. దేశం లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 49 లక్షలు దాటింది. గత 24 గంటల్లో దేశం లో 83,809 మందికి కరోనా సోకిందని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 49,30,237 కు చేరింది. గ‌త 24 గంట‌ల సమయంలో 1,054 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య మొత్తం 80,776 కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటి వరకు 38,59,400 మంది కోలుకున్నారు. 9,90,061 మందికి ప్రస్తుతం ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది.