Begin typing your search above and press return to search.
పట్నం పొమ్మన్నది.. పల్లెతల్లి ఆదరించింది
By: Tupaki Desk | 15 Sep 2020 5:30 AM GMTపట్టణాల్లో చిరుఉద్యోగాలు, కూలిపనులు చేసుకుంటూ జీవనం సాగించిన లక్షల మంది కరోనా మహమ్మారి సృష్టించిన అల్లకల్లోలంతో ఉపాధి కోల్పోయారు. ప్రభుత్వం విధించిన లాక్డౌన్ తో వారంతా సొంత ఊళ్ల కు వెళ్లి పోయారు. పట్టణాలు విడిచిపెట్టి సొంతూళ్లకు చేరుకున్న ఆ అభాగ్యులను పల్లె తల్లి ఆదరించింది. ఆదాయం కోల్పోయి దుర్భర పేదరికం లో ఉన్న నిరుపేద పేదలందరూ ఇప్పడు పల్లెలకు చేరుకొని తమకు ఉన్న కొద్దిపాటి భూమిని చదునుచేసి.. సాగు చేసుకుంటున్నారు. ఈ ఏడు ప్రకృతి కూడా అనుకూలించి వర్షాలు పుష్కలంగా కురవడంతో వారు సంతోషం గా ఉన్నారు.
ఉన్న ఊరు కన్నతల్లి లాంటిది..
ఉత్తర ప్రదేశ్ కు చెందిన అజయ్‌కుమార్ నోయిడాలోని గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్లో చిన్న ఉద్యోగం చేసేవాడు. నోయిడా శివారులోని కొంత స్థలం కొనుగోలు చేసి అక్కడే స్థిరపడాలని కలలు కన్నాడు. కానీ కరోనా మహమ్మారి అతడి కలలను ఆవిరిచేసింది. ఉన్న ఉద్యోగం ఊడిపోవడంతో హమీర్పూర్ జిల్లాలోని తన స్వగ్రామానికి చేరుకున్నాడు. అక్కడ తనకున్న కొద్ది పాటి పొలాన్ని చదును చేసి పప్పు దినుసులను విత్తాడు. ప్రస్తుతం వర్షాలు కురవడంతో అతడి పంట కోతకు వచ్చింది. ప్రస్తుతం తానెంతో సంతోషంగా ఉన్నానని.. కరోనాతో ఉద్యోగం కోల్పోయిన తనను పల్లెతల్లి ఆదరించిదని అజయ్ చెప్పారు.
మధ్యప్రదేశ్ కు చెందిన చంద్రగోపాల్ది సరిగ్గా ఇదే తరహా కథ.. ఆయన కుటుంబంతో కలిసి ఢిల్లీలో దినసరి కూలీగా పనిచేసేవాడు. కరోనా లాక్‌డౌన్‌తో ఉపాధి పోయింది. దీంతో సొంతూరైన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని తార్పూర్ జిల్లా తనూరు ఖరేహాకు వెళ్లిపోయారు. అక్కడ తన సొంత పొలాన్ని చదును చేయడంతోపాటు.. గ్రామంలో కుటుంబ సభ్యులంతా కూలి పనులు చేసుకుంటున్నారు. దీంతో తమకు ఉపాధి దొరికిందని పట్టణం మమ్మల్ని వెళ్లగొట్టిన పల్లె తల్లి అక్కున చేర్చుకున్నదని చంద్ర గోపాల్ సంతోషం గా చెప్పారు. మేము కేవలం ఐదువేల రూపాయలు పెట్టుబడి పెట్టి పంటలు సాగుచేశాము. ఇప్పడు పంట కోత దశకు వచ్చింది ఎంతో సంతోషంగా ఉన్నామని చెబుతున్నది ఈ కుటుంబం. వీళ్లిద్దరే కాదు దేశవ్యాప్తంగా అనేకమంది పల్లెల్లోకి వచ్చి పనులు చేసుకుంటున్నారు. దీంతో వ్యవసాయరంగం మరింత పుంజుకుంటున్నది. కాలుష్య కోరల్లో దిక్కు మొక్కులేని జీవితం గడిపే కంటే.. పల్లెల్లో అయినవారి మధ్య ఎంతో సంతోషంగా ఉండవచ్చని చెబుతున్నారు
వ్యవసాయానికి కొత్త ఊపు..
వలసకూలీలు పల్లెబాట పట్టి వ్యవసాయం చేస్తుండటంతో వ్యవసాయ రంగానికి ఊపు వచ్చిందని ఆర్థిక వేత్తలు పేర్కొంటున్నారు. గత ఏడాది తో పోలిస్తే ఈ ఏడాది పంట సాగు గణనీయంగా పెరిగింది. వ్యవసాయాధికారులు విడుదల చేసిన గణాంకాలే ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. జూలై 17నాటికి అందిన సమాచారం ప్రకారం గతేడాది తో పోలిస్తే ఈ ఏడాది ఖరీఫ్ పంట ఏడాది పెరిగింది. అలాగే మినుములు 43.11 శాతం, రాగి 45 శాతం, వేరు సెనగ 56.57 శాతం, వరి 19 శాతం, చమురు గింజల ఉత్పత్తి 44 శాతం పెరిగింది.