Begin typing your search above and press return to search.

సైలెన్స్​ ప్లీజ్​.. నిశ్శబ్దంగా ఉంటే కరోనా రాదట!

By:  Tupaki Desk   |   12 Sep 2020 11:30 PM GMT
సైలెన్స్​ ప్లీజ్​.. నిశ్శబ్దంగా  ఉంటే కరోనా రాదట!
X
కొంతమంది గట్టిగా అరుస్తూ మాట్లాడుతుంటారు.. తోటి ఉద్యోగులపై విరుచుకుపడుతుంటారు. నోరేసుకు పడిపోతారు. అలా మాట్లాడితేనే పనులు సక్రమంగా జరుగుతాయని నమ్ముతుంటారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో అవన్నీ కొంతకాలం కట్టిపెట్టాలట. కరోనా వ్యాప్తిని అరికట్టాలంటే నెమ్మదిగా మాట్లాడాలని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. గట్టిగా అరవడం వల్ల మన నోటిలోనుంచి వైరస్​ వెనువెంటనే గాల్లోకి వ్యాపిస్తుంది. అది పీల్చుకున్నవారందరికీ కరోనా వస్తుంది. అందువల్ల నెమ్మదిగా మాట్లాడితే కరోనా వ్యాప్తిని కొంతమేర తగ్గించుకోవచ్చని సూచిస్తున్నారు శాస్త్రవేత్తలు. ఇది ఎవరో నోటిమాటగా చెప్పింది కాదండి.. దీనిపై కాలిఫోర్నియా యూనివర్సిటీ సైంటిస్టులు అధ్యయనం చేశారు. ఎక్కువగా మాట్లాడే ప్రదేశాల్లో, రద్దీప్రదేశాల్లో కరోనా ఎక్కువగా ఉందని వాళ్ల అధ్యయనంలో తేలింది. అంతేకాక నిశ్శబ్దంగా పనిచేసుకొని పోయేవారికి కరోనా సోకే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని అధ్యయనంలో వెల్లడైంది.

మరిన్నిజాగ్రత్తలు మీకోసం..
మన ఇంట్లోకి గాలీ, వెలుతురు పుష్కలంగా వచ్చేలా చూసుకోవాలి. ముఖ్యంగా గదిలోని గాలి బయటకు వెళ్లే ఏర్పాటు చేసుకోవాలి. ఎప్పటికప్పుడు తాజా గాలి ఇంట్లోకి వచ్చేలా జాగ్రత్త పడాలి. ఇంట్లో ఉన్నవారు కూడా అవసరమైనమేరకు మాట్లాడి.. వీలైనంత సేపు నిశ్శబ్దంగా ఉండాలి. ఎవరికోసమైనా ఆస్పత్రికి వెళితే అక్కడ గంటలు, గంటలు వేచిచూడకుండా వెంటనే వచ్చేయాలి. వీలైనంతవరకు బయట భోజనం చేయకపోవడం ఉత్తమం.


ఇక ఆచీతూచి మాట్లాడండి..
మాట్లాడేటప్పుడు మన నోటినుంచి విడుదలయ్యే నోటితుంపర్లు వెంటనే ఆవిరైపోతాయి. వాటిలోనంచి ఏరోసోల్​ కణాలు విడుదలవుతాయి. ఈ ఏరోసోల్​ కణాల్లోనే వైరస్​ కారకాలు ఉంటాయి. మనం పెద్దగా మాట్లడినప్పడు మననోటి నుంచి వచ్చే శబ్దాలు సుమారు 70 డెసిబెల్స్​ వరకు ఉంటాయి. వీటివల్ల ఏరోసోల్​ కణాలు ఎక్కువగా విడుదలవుతాయి. చిన్నగా మాట్లాడితే కేవలం 35 డెసిబెల్స్​ వరకు మాత్రమే శబ్దం వస్తుంది. అందువల్ల వైరస్​ వ్యాప్తికి అవకాశం తక్కువగా ఉంటుందని ఈ అధ్యయనంలో వెల్లడైంది.


తక్కువ శబ్దం .. తక్కువ ప్రమాదం
రద్దీ ఓ మోస్తరుగా ఉన్నా.. నిశ్శబ్దంగా ఉన్న ప్రదేశాలు తక్కువ ప్రమాదకారులని ఈ అధ్యయనంలో తేలింది.
ఏరోసోల్స్ లేని ఆపరేటింగ్ థియేటర్‌లో వేర్వేరు పిచ్‌లు వాల్యూమ్‌లలో ‘హ్యాపీ బర్త్‌డే’ పాడారు.. నిర్దిష్ట శబ్దాల ద్వారా ఉత్పత్తి అయిన ఏరోసోల్‌లను విశ్లేషించడానికి పరిశోధించారు. వాయిస్ పరిమాణం ఏరోసోల్ పరిమాణంపై అతిపెద్ద ప్రభావాన్ని చూపుతుందని కనుగొన్నారు. ఇలాంటి స్థాయిలో మాట్లాడటం పాడటం మధ్య కొంత తేడా ఉందని గుర్తించారు. పెద్ద ఎత్తున పాడటం లేదా అరవడం 30 రెట్లు ఎక్కువ ఏరోసోల్‌ను ఉత్పత్తి చేస్తుందని కనుగొన్నారు. అందుకొని తక్కువ మాట్లాడండి.. చిన్నగా మాట్లాడండి.. కరోనానుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోండి.. మీ తోటివాళ్లను కాపాడండి.