Begin typing your search above and press return to search.

దేశంలో కరోనా కలకలం ...కొత్తగా ఎన్నంటే ?

By:  Tupaki Desk   |   12 Sep 2020 5:15 AM GMT
దేశంలో కరోనా కలకలం ...కొత్తగా ఎన్నంటే ?
X
భార‌త్ లో క‌రోనా మహమ్మారి పాజిటివ్ కేసుల సంఖ్య, అలాగే కరోనా మహమ్మారి తో మరణించే వారి సంఖ్య రోజురోజుకి భారీగా పెరిగిపోతోంది. గత 24 గంటల్లో దేశంలో 97,570 మందికి కరోనా సోకిందని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 46,59,985కు చేరింది. గ‌త 24 గంట‌ల్లో 1,201 మంది మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య మొత్తం 77,472కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 36,24,197 మంది కోలుకున్నారు. 9,58,316 మందికి ప్రస్తుతం ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. మొత్తం కేసుల్లో యాక్టివ్‌ కేసులు 20.56 శాతం ఉన్నాయి. మరణాల రేటు 1.66 శాతానికి తగ్గింది.

తెలంగాణలో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 2278 పాజిటివ్‌ కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 1,54,880 కి చేరింది. వైరస్‌ బాధితుల్లో కొత్తగా 10 మంది మృతి చెందడంతో.. మొత్తం మృతుల సంఖ్య 950 కి చేరింది. శుక్రవారం ఒక్కరోజే 2458 మంది కరోనా వైరస్ రోగులు కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. ఇప్పటివరకు కోలుకున్నవారి మొత్తం సంఖ్య 1,21,925. గత 24 గంటల్లో 62,234 వైరస్‌ నిర్ధారణ పరీక్షలు చేశామని, ఇప్పటివరకు మొత్తం 20,78,695 పరీక్షలు చేశామని బులిటెన్ లో వెల్లడించింది.

ఏపీలో నిన్న 71,137 మందికి పరీక్షలు నిర్వహించగా, మరో 9,999 మందికి పాజిటివ్‌గా తేలింది. దీంతో ఇప్పటి వరకు నిర్వహించిన పరీక్షల సంఖ్య 44,52,128కి చేరగా, మొత్తం పాజిటివ్‌ కేసులు 5,47,686కి చేరాయి. తాజాగా 77 మంది మృతితో మొత్తం మరణాల సంఖ్య 4,779కి చేరింది. యాక్టివ్‌ కేసులు 96,191 ఉన్నాయి.